నాని హిట్ 3 నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యింది.రిలీజైన దగ్గరనుండి బాక్సాఫీస్ వద్ద రాంపేజ్ కొనసాగిస్తుండడం తో అతి తక్కువ రోజుల్లో ఈ ఫీట్ సాధించింది. నాని కెరీర్ లో ఇది 3వ 100కోట్ల సినిమా.ఇంతకుముందు దసరాతో ఈ ఫీట్ సాధించగా ఆతరువాత సరిపోదా శనివారం తో రెండో సారి ఈ క్లబ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఇక హిట్ 3 తో మరోసారి ఈ మార్క్ ను టచ్ చేశాడు.4 రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 101 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.మొదటి మూడు రోజులు సెన్సేషన్ సృష్టించిన ఈసినిమా నాలుగో రోజు కూడా అదరగొట్టింది.చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా దుమ్మురేపుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిన్నటి తో నార్త్ అమెరికాలో 2 మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది. ఇప్పటికే అక్కడ బ్రేక్ ఈవెన్ కావడంతో లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే దాదాపు 13 కోట్ల గ్రాస్ తో నైజాంలో బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేయగా వైజాగ్ లో కూడా టార్గెట్ కంప్లీట్ చేసింది.ఈవారం లో కల్లా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేయనుంది.ఓవరాల్ గా చూస్తే హిట్ 3 నాని కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలువనుంది. ఫుల్ రన్ లో ఈసినిమా 150 కోట్ల క్లబ్ లో జాయిన్ కానుంది.
శైలేష్ కొలను ఈసినిమాను డైరెక్ట్ చేయగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది.మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు.నానితోకలిసి ప్రశాంతి తిపిర్నేని ఈసినిమాను నిర్మించారు.ఇక నాని నెక్స్ట్ దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తో ది ప్యారడైజ్ చేయనున్నాడు.త్వరలోనే నాని షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. వచ్చే ఏడాది మార్చి 26న ఈసినిమా విడుదలకానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























