నాని హిట్ 3 తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్ లో దుమ్మురేపుతోంది.మొదటి రెండు రోజుల్లో 62 కోట్లు కొల్లగొట్టిన ఈసినిమా నిన్న 20 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద రాంపేజ్ కొనసాగించింది.వీకెండ్ కావడంతో వూహించనట్లుగానే సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.దాంతో మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 82కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నార్త్ అమెరికాలో అయితే నిన్నటి వరకు 1.7మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది. ఈరోజుతో 2 మిలియన్ మార్క్ ను చేరుకోనుంది.ఆల్రెడీ అక్కడ బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేయడంతో లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాలో కూడా 80 శాతానికి పైగా రికవరీ చేసింది.ఈరోజు తో టార్గెట్ ను పూర్తి చేయనుంది.అంతేకాదు ఈరోజుతో 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. నాని కెరీర్ లో వేగంగా ఈ ఫీట్ సాధించిన సినిమాగా హిట్ 3 రికార్డు సాధించింది ఓవరాల్ గా నానికి ఇది మూడో 100కోట్ల సినిమా.ఫుల్ రన్ లో హిట్ 3,150 కోట్ల మార్క్ ను టచ్ చేయనుంది.
క్రైమ్ థ్రిల్లర్ గా శైలేష్ కొలను తెరకెక్కించిన ఈసినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు. నాని తోకలిసి ప్రశాంతి తిపిర్నేని ఈసినిమాను నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























