దిల్ రాజు గారి విజన్‌కి కంగ్రాట్స్ – మంత్రి శ్రీధర్ బాబు

Telangana IT Minister Sridhar Babu Congratulates Producer Dil Raju

దిల్ రాజు గారి ‘లోర్వెన్ AI’ స్టూడియో ఎంటర్‌టైన్‌మెంట్ వరల్డ్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాలని కోరుకుంటున్నానని తెలిపారు తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు. ఈ మేరకు ఆయన తాజాగా దిల్ రాజు ఆధ్వర్యంలో క్వాంటం భాగస్వామ్యంతో ‘లోర్వెన్ AI’ స్టూడియో గ్రాండ్ లాంచ్ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన అతిరధమహారధులు హాజరయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. నా మిత్రులు దిల్ రాజు గారు మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్న టెక్నాలజీని సినీ రంగంలోకి పరిచయం చేయాలనే దృఢ సంకల్పంతో ఈరోజు’లోర్వెన్ AI’ స్టూడియోని లాంచ్ చేస్తున్న సందర్భంలో వారికి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దిల్ రాజు గారి విజన్ కి కంగ్రాచ్యులేషన్స్.”

“మూవీ వరల్డ్ కి ఫ్యూచర్స్టిక్ టెక్నాలజీని బిల్డ్ చేసిన దిల్ రాజు గారికి వారి టీం కి అభినందనలు. క్వాంటం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ. వారు ‘లోర్వెన్ AI’ స్టూడియోలో భాగస్వామ్యం కావడం అభినందనీయం. తెలంగాణ టెక్నాలజీ డ్రివెన్ స్టేట్. గత మూడు దశాబ్దాలుగా మనం లీడర్స్ ఆఫ్ టెక్నాలజీ అని ఈ వరల్డ్ కి ప్రూవ్ చేసుకున్నాం. హాలీవుడ్ కి ధీటుగా హైదరాబాదు ఎదుగుతోంది.”

“ఈరోజు జరిగిన నాలుగు ప్రొడక్ట్స్ లాంచ్ ఎంటర్టైన్మెంట్ లో గేమ్ చేంజెర్స్ అనిపిస్తున్నాయి. ఈ టెక్నాలజీని మూవీతో బ్లెండ్ చేయడమనేది ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్ స్టెప్. దిల్ రాజు గారు వారి టీం కలిసి చేసిన ఈ ప్రోడక్ట్ అద్భుతం. చాలా సినిమాలు ఎఐ ఇంటిలిజెన్స్ ఆధారంగా వస్తున్నాయి. క్రియేటివిటీని డూప్లికేట్ చేయలేం గానీ క్రియేటివిటీని టెక్నాలజీ తో ఎన్హాన్స్ చేయవచ్చు.”

“టెక్నాలజీ కొత్త అవకాశాలు తెరపైకి వస్తాయి. కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి. చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి. ప్రతి రంగంలో మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మూవీస్ కూడా న్యూ పేజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ లోకి వెళ్తున్నాయి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ లో ఎవరైతే లీడ్ తీసుకుంటారో వాళ్లే లీడర్స్. దిల్ రాజు గారు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉండి లీడర్ గానే ఆయన జర్నీని కొనసాగిస్తున్నారు.”

“ఆయన ‘లోర్వెన్ AI’ స్టూడియో నెక్స్ట్ లెవలో టెక్నాలజీ లోకి వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. దిల్ రాజు గారు ఈ విజన్ తో రావడం చాలా ఆనందాన్నిచ్చింది. దిల్ రాజు గారి లాంటి కింగ్ ఆఫ్ మూవీ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ ఏఐ లోకి రావడం శుభ పరిణామం. ఆయన ఈ వేడుకకి నన్ను ఆహ్వానించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. దిల్ రాజు గారికి వారి కుటుంబానికి వారి టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఇది అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.