చార్మింగ్ స్టార్ శర్వా తన మేడిన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ #Sharwa38ని ప్రారంభించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కొలాబరేషన్ శర్వా, దర్శకుడు సంపత్ నంది ఇద్దరికీ ఒక ముఖ్యమైన మైల్ స్టోన్‌ని చూస్తోంది. ఈ గ్రిప్పింగ్, హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తుండగా.. లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం టైటిల్ ప్రకటించారు మేకర్స్. ఈ పీరియాడిక్ డ్రామాకు ‘భోగి’ అనే పేరును ఖరారు చేశారు. ఈ మేరకు నేడు చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 1960లో ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో జరిగిన కథతో రూపొందుతోన్న భోగి ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందించబోతోంది. ఈ చిత్రం హై-స్టేక్స్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది.
ఇక ఈ సందర్భంగా ఒక ప్రత్యేక వీడియోను రిలీజ్ చేసింది. దర్శకుడు సంపత్ నంది విధి, పోరాటం, మార్పు అనే కథను నరేట్ చేస్తుండగా ఈ వీడియో సినిమా ఎసెన్స్ చూపిస్తుంది. శర్వా ఆ కథను ఆసక్తిగా వింటూ, ధైర్యం, యుద్ధాలతో నిండిన ఒక ప్రపంచాన్ని ఊహించుకుంటాడు. కీలక ఘట్టంగా ఒక ఖడ్గం ప్రయాణం మొదలవుతుంది. అలా ‘భోగి’ టైటిల్ రివిల్ అవుతుంది. ఈ టైటిల్ కొత్త శక్తి, తిరుగుబాటును ప్రజెంట్ చేస్తోంది.
వీడియోలో ప్రజెంట్ చేసినట్లుగా శర్వా నెవర్ బిఫోర్ పాత్రలోకి అడుగుపెడుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈరోజు హైదరాబాద్‌లో నిర్మించిన భారీ సెట్లో గ్రాండ్ స్కేల్లో ప్రారంభమైయింది. వీటిలో కొన్ని భాగాలను కాన్సెప్ట్ వీడియోలో ప్రజెంట్ చేశారు. ఈ విజన్‌ని జీవం పోయడానికి ప్రొడక్షన్ టీం ఆరు నెలలు డెడికేషన్‌తో వర్క్ చేసి, దాదాపు 20 ఎకరాల భూమిని బ్రెత్ టేకింగ్ బ్యాక్‌డ్రాప్‌గా మార్చింది.
ఇక ఈ చిత్రం హైబడ్జెట్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతుంది. ఇప్పటికే ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌ని హీరోయిన్గా అనౌన్స్ చేసిన తర్వాత, మేకర్స్ మరో క్రూషియాల్ రోల్ కోసం డింపుల్ హయాతిని ఎంపిక చేశారు. ఇది ప్రాజెక్ట్‌కు మరింత స్టార్ పవర్‌ని యాడ్ చేసింది. ఈ పవర్ ఫుల్ పాత్రకు ప్రాణం పోసేందుకు డింపుల్ పర్ఫెక్ట్ చాయిస్. అనుపమ, డింపుల్ ఇద్దరూ ఇంపాక్ట్ ఫుల్ రోల్స్ పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. కాగా సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్ మరియు ఇతర నటీనటుల వివరాలను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేయనున్నారు. అలాగే ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: