SVC 60 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అప్‌డేట్

SVC 60 Title and First Look to be Out Tomorrow on May Day

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేతలు దిల్ రాజు, శిరీష్ ఇటీవలే తమ 60వ ప్రొడక్షన్‌ని అనౌన్స్ చేశారు. ఇది వారి విజయవంత చిత్ర నిర్మాణ ప్రయాణంలో మెయిన్ మైల్ స్టోన్‌ని సూచిస్తుంది. ఈ మూవీలో ‘రౌడీ బాయ్స్, లవ్ మీ’ చిత్రాలలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న యంగ్ నటుడు ఆశిష్ హీరోగా నటిస్తున్నాడు. రేపు మేడే సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అప్‌డేట్ ఇవ్వనున్నారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మూవీ హైదరాబాద్ ఓల్డ్ సిటీ నేపథ్యంలో రూపొందుతుండగా.. ఆశిష్ లోకల్ బాయ్‌గా కనిపిస్తున్నాడు. దీంతో కథకు తగ్గట్టు రగ్గడ్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే తన మునుపటి పాత్రలలో వెర్సటాలిటీని ప్రజెంట్ చేసిన ఆశిష్, ఈ చిత్రం కోసం పూర్తిగా మేకోవర్ కానున్నారు. మరింత ఇంటెన్స్, మాస్-ఓరియెంటెడ్ లుక్‌లో కనిపించబోతున్నారు. డెబ్యూ డైరెక్టర్ ఆదిత్యరావు గంగాసాని ఈ సినిమా కోసం హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో అద్భుతమైన కథని రెడీ చేశారు.

ఎక్సైట్‌మెంట్‌ని మరింత పెంచుతూ, నిర్మాతలు న్యూ ట్యాలెంట్ కోసం ముఖ్యంగా హైదరాబాద్ యాసని ఫ్లూయంట్‌గా మాట్లాడే వారి కోసం కాస్టింగ్ కాల్‌ని అనౌన్స్ చేశారు. ఇది ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగం కావడానికి గొప్ప అవకాశం అందిస్తుంది. అద్భుతమైన ట్రాక్ రికార్డ్‌ గల శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరోసారి హై బడ్జెట్, హై ప్రొడక్షన్ వాల్యూస్ గల చిత్రాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాకి సంబధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేయనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.