చార్మింగ్ స్టార్ శర్వా తన మేడిన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ #Sharwa38ని ప్రారంభించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కొలాబరేషన్ శర్వా, దర్శకుడు సంపత్ నంది ఇద్దరికీ ఒక ముఖ్యమైన మైల్ స్టోన్‌ని చూస్తోంది. ఈ గ్రిప్పింగ్, హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తుండగా.. లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ చిత్రం హైబడ్జెట్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతుంది. ప్రీ-ప్రొడక్షన్ విషయంలో కూడా టీం చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఇప్పటికే ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌ని హీరోయిన్గా అనౌన్స్ చేసిన తర్వాత, మేకర్స్ ఇప్పుడు మరో క్రూషియాల్ రోల్ కోసం డింపుల్ హయాతిని ఎంపిక చేశారు. ఇది ప్రాజెక్ట్‌కు మరింత స్టార్ పవర్‌ని యాడ్ చేసింది.
కాగా కథలో క్రూషియల్ రోల్‌ని డింపుల్ పోషించనుంది. ఈ పవర్ ఫుల్ పాత్రకు ప్రాణం పోసేందుకు డింపుల్ పర్ఫెక్ట్ చాయిస్. అనుపమ, డింపుల్ ఇద్దరూ ఇంపాక్ట్ ఫుల్ రోల్స్ పోషిస్తున్నారు. అనుపమ పోస్టర్ ఒక బోల్డ్ ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తోంది. డింపుల్ పాత్ర కూడా ఇంటెన్స్ ఎనర్జీ వుంది. ఆమె ముఖం కనిపించకపోయినా, మెడ, ముక్కు, చెవులు, చేతులు, వేళ్లపై బంగారు ఆభరణాలతో వుండటం ఆసక్తికరంగా వుంది.
1960లో ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో సెట్ చేయబడిన #Sharwa38 ప్రేక్షకులను మరపురాని అనుభూతిని అందించబోతోంది. ఈ చిత్రం హై-స్టేక్స్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది. ఇక ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
కాగా సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్ మరియు ఇతర నటీనటుల వివరాలను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేయనున్నారు. అలాగే ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























