టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా.. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ మూవీ ‘కింగ్‌డమ్’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ మూవీ టీజర్ విడుదల చేయగా, మంచి స్పందన వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సమ్మర్ కానుకగా మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కింగ్‌డమ్ మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెడుతున్నారు మేకర్స్. దీనిలో భాగంగా తాజాగా ఫస్ట్ సింగిల్‌కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ పంచుకుంది చిత్ర బృందం. ఏప్రిల్ 30న ఈ ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేయనున్నట్టు తెలిపింది. ఇక త్వరలోనే ఫుల్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేయనుంది.
ఇక గత కొన్నేళ్లుగా అనిరుధ్ తన అద్భుతమైన సంగీతంతో మ్యూజిక్ లవర్స్‌నే కాకుండా మూవీ లవర్స్‌ని సైతం అలరిస్తున్నారు. కేవలం అనిరుధ్ మ్యూజిక్ వల్లనే కొన్ని సినిమాలు హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయని సినీప్రియులు అంటుంటారు. బీజీఎమ్ ఒక్కటే కాకుండా సాంగ్స్‌లో కూడా అనిరుధ్ మ్యాజిక్ కనిపిస్తుంది. ఈ క్రమంలో కింగ్‌డమ్ పాటలపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఇవి ఎలా ఉండబోతున్నాయి తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























