రాష్ట్రపతి చేతులమీదుగా.. పద్మభూషణ్ అందుకున్న బాలకృష్ణ

Nandamuri Balakrishna Received Padma Bhushan From President Droupadi Murmu

టాలీవుడ్ స్టార్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ‘పద్మ భూషణ్‌’ అవార్డు అందుకున్నారు. ఈ మేరకు సోమవారం రాష్ట్రపతి భవన్‌ వేదికగా జరిగిన పద్మ అవార్డుల వేడుకలో ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని స్వీకరించారు. కాగా ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ వేడుకకు బాలయ్య అచ్చ తెలుగు ఆహార్యమైన పంచె కట్టులో హాజరవడం అందరినీ ఆకర్షించింది. తండ్రి నందమూరి తారకరామారావు (సీనియర్ ఎన్టీఆర్) నట వారసుడిగా వెండితెరకు పరిచయమైన బాలకృష్ణ వటుడింతై అన్నట్టుగా ఎదిగారు. ఈ క్రమంలో గతేడాది 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. అలాగే బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి ఛైర్మన్‌గా కూడా ఎంతో మందికి సాయం అందిస్తున్నారు.

ఇక ఆయన చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం బాలయ్యకు ‘పద్మ్ఘభూషణ్‌’ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు బాలకృష్ణకు శుభాభినందనలు తెలియజేస్తున్నారు. మరోవైపు బాలయ్యతోపాటు కోలీవుడ్‌ స్టార్ హీరో ‘తల’ అజిత్‌ కుమార్ సైతం ‘పద్మభూషణ్‌’ అవార్డు అందుకున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.