నాకు కంటెంట్ నచ్చితే చాలు, ముందుకొచ్చి ప్రమోట్ చేస్తా

Director Harish Shankar Interesting Comments on Telugu Audience at Gymkhana Pre Release Event

మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ప్రేమలు’తో అలరించిన నస్లెన్ ‘జింఖానా’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఖలీద్ రెహమాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే మలయాళంలో బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్ అయ్యింది. ఖలీద్ రెహమాన్, జోబిన్ జార్జ్, సమీర్ కారత్, సుబీష్ కన్నంచెరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడీ స్పోర్ట్స్-ప్యాక్డ్, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఏప్రిల్ 25న తెలుగు థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ చీఫ్ గెస్ట్‌గా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. సందర్భంగా ఈవెంట్‌లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘జింఖానా’ టీం అందరికీ కంగ్రాట్స్. ఈ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్. ఈ సినిమాని సుబ్బారెడ్డి గారు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ ఖలీద్ రెహమాన్ బాక్సర్. కాబట్టే ఇలాంటి సినిమాని అద్భుతంగా తీయగలిగాడు. ట్రైలర్‌లో షాట్స్ చాలా బావున్నాయి.” అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “తన ఫస్ట్ సినిమా చాలా బావుంటుంది. అది నా ఆల్ టైం ఫేవరేట్. ఈ సినిమా కూడా పెద్ద హిట్. నైజాం శశిగారు చేస్తున్నారు కాబట్టి ఇంక తిరుగువుండదు. ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. నాకు సినిమా కంటెంట్ నచ్చితే భాష, చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రమోట్ చేయడానికి ముందు వుంటాను. ఈ సినిమా ట్రైలర్ నాకు చాలా నచ్చింది. నస్లెన్ అద్భుతమైన పెర్ఫార్మ్. ఈ సినిమాని అందరూ థియేటర్స్ కి వెళ్లి చూడాలని కోరుకుంటున్నాను. ఏప్రిల్ 25న థియేటర్స్ లో చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు” అని అన్నారు.

అయితే మన ప్రేక్షకులు తెలుగు సినిమాలకన్నా బయటి చిత్రాలనే బాగా ఇష్టపడతారని గతంలో తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేసిన ఆయన అందుకు ఇటీవల వచ్చిన ‘డ్రాగన్’ మూవీని ఉదాహరణగా చూపించారు. అలాగే ఇప్పుడు ఈ జింఖానా చిత్రం కూడా పెద్ద హిట్ కాబోతుందని, అప్పుడు తాను చెప్పిన మాటలను అందరూ ఒప్పుకుంటారని అన్నారు. కాగా ఇంతకుముందు కూడా పలు సందర్భాల్లో హరీష్ శంకర్ తెలుగు ఆడియెన్స్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వారికి సినిమా నచ్చితే ఏ భాషకు చెందినదైనా చూస్తారని, కానీ తెలుగు చిత్రాలను అంతగా ఆదరించారని హరీష్ అన్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి ఆయన ఇలాంటి కామెంట్స్ చేయడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.