గత కొన్ని వారాల నుండి సరైన సినిమాలు లేక బాక్సాఫీస్ వెలవెలబోతోంది.అయితే మే 1న పెద్ద సినిమా దిగుతుంది.టాలీవుడ్ ఈసినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది.ఇంతకీ ఆ సినిమా ఏంటంటే నేచురల్ స్టార్ నాని హిట్ 3.ఈసినిమాకు బజ్ రోజు రోజుకు పెరిగిపోతుంది.ట్రైలర్ రిలీజ్ అయ్యేంతవరకు హైప్ అంతమాత్రమే ఉండగా ట్రైలర్ వచ్చాక మాత్రం పరిస్థితి మారిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దానికి తోడు నాని సినిమాను తెగ ప్రమోట్ చేస్తున్నాడు.పాన్ ఇండియా రిలీజ్ కావడంతో అన్ని భాషల్లో ప్రమోట్ చేస్తున్నాడు.ఈసినిమాతో నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రానున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా సాలిడ్ గా జరిగింది. థియేట్రికల్ రైట్స్ భారీ ధర పలుకగా ఓటిటి రైట్స్ రికార్డు ప్రైస్ కు అమ్ముడయ్యాయి. దాంతో విడుదలకు ముందే నిర్మాతలు గట్టెక్కారు. నాని ఈసినిమాకు నిర్మాత కూడా కావడంతో అన్ని తానై వ్యవహరిస్తున్నాడు.
ఇక నాని కెరీర్ లోనే మోస్ట్ వైలెంట్ మూవీగా వస్తుంది హిట్ 3. మరి ఫ్యామిలీ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది చూడాలి.హిట్ 3 ని శైలేష్ కొలను తెరకెక్కిస్తుండగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది.మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.నాని తోకలిసి ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తుంది.రీసెంట్ గా ఈ నిర్మాతల నుండి వచ్చిన కోర్ట్ 50 కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఇక ఇప్పుడు నెలన్నర గ్యాప్ లో హిట్ 3 తో వస్తున్నారు.మరి ఈసినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























