వరుస విజయాలతో ప్రియదర్శి మంచి ఊపు మీద ఉన్నారు. ఆయన హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రియదర్శి మీడియాతో ముచ్చటించారు. ఆయన సినిమా గురించి చెప్పిన సంగతులివే..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘కోర్ట్’ లాంటి హిట్ తరువాత మళ్లీ ‘సారంగపాణి జాతకం’తో రాబోతోన్నారు.. ఈ చిత్రం ఎలా ఉండబోతోంది?
- సారంగపాణి జాతకం’ కథ లాస్ట్ ఇయర్ విన్నాను. ఈ చిత్రం గత ఏడాది చివర్లో రావాల్సింది.
- కానీ కాస్త ఆలస్యంగా ఇప్పుడు ఏప్రిల్ 25న వస్తున్నాం.
- కోర్ట్ లాంటి హిట్ తరువాత మళ్లీ వెంటనే ‘సారంగపాణి జాతకం’ అని వస్తుండటం ఆనందంగా ఉంది.
- నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఎలాంటి ఒత్తిడి లేదు.
సారంగపాణి జాతకంలో మాదిరిగా మీరు నిజ జీవితంలో జాతకాలు నమ్ముతారా?
- సారంగపాణి జాతకం చిత్రంలో చూపించినట్టుగా కాదు కానీ.. నేను కొంత నమ్ముతాను.
- ఇండస్ట్రీలో ఏదీ మన కంట్రోల్‌లో ఉండదు.
- మంచి సినిమాను చేయాలని ప్రయత్నిస్తాం. ఫలితం మన చేతుల్లో ఉండదు.
- ఈ మూవీని ఎప్పుడో రిలీజ్ చేద్దామని అనుకున్నాం.
- కానీ బిజినెస్ పరంగా, థియేటర్ల పరంగా అన్నీ లెక్కేసుకుని ఇప్పుడు ఏప్రిల్ 25న వస్తున్నాం.
సారంగపాణి జాతకంలో మీరు ఏం చెప్పబోతోన్నారు?
- జాతకాలు నమ్మాలి అని కానీ, నమ్మకూడదు అని కానీ, మేం చెప్పం.
- కానీ ఒకరి నమ్మకాల్ని ఇంకొకరి మీద రుద్దితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూపిస్తాం.
- ఏ సైడ్ తీసుకుని మాత్రం కథను చెప్పలేదు.
మీరు ఎక్కువగా ఎమోషనల్ స్టోరీలను ఎంచుకుంటున్నారు. అవే ఎక్కువగా విజయాన్ని సాధిస్తుండటం గురించి చెప్పండి?
- కామన్ మేన్ పాత్రల్ని పోషిస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందని నా నమ్మకం.
- ‘మల్లేశం‘ అయినా, ‘సారంగపాణి‘ అయినా మన చుట్టు పక్కనే చూస్తాం.
- వారి జర్నీ చాలా పెయిన్ ఫుల్‌గా ఉంటుంది.
- ‘మల్లేశం, బలగం, కోర్ట్, సారంగపాణి‘ ఇలా అన్నీ కూడా మన చుట్టూనే చూస్తుంటాం.
- ఇందులో జాతకాల్ని నమ్మే ఓ కుర్రాడి పాత్రను పోషించాను.
ప్రారంభంలో కామెడీ రోల్స్ చేసిన మీరు ఇప్పుడు ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్‌లు చేస్తుండటం గురించి చెప్పండి?
- ప్రస్తుతం నవ్వించడం అనేది చాలా కష్టమైన పని. ఇంద్రగంటి కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది.
- ఇలాంటి ఓ పాత్రను ఇంత వరకు నేను చేయలేదనిపిస్తోంది. ఇది చాలా కొత్తగా ఉండబోతోంది.
- ఈ చిత్రం, అందులోని నా పాత్ర అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను.
సారంగపాణి జాతకం చిత్రంలో మీ పాత్ర, యాస ఎలా ఉండబోతోంది?
- ఇంత వరకు నేను ఎక్కువగా తెలంగాణ మాండలికంలోనే ఎక్కువగా మాట్లాడాను. కానీ ఈ సారి మాత్రం ఆంధ్ర యాసలో మాట్లాడతాను.
- ఇంద్రగంటి గారి స్టైల్‌లోనే మాట్లాడేందుకు ప్రయత్నించాను. ఆయన నా కోసం ఇందులో సపరేట్ ట్రాక్, టైమింగ్‌ను సెట్ చేశారు.
- అది అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా.
తనికెళ్ల భరణి, నరేష్, అవసరాల శ్రీనివాస్ వంటి వారితో పని చేసిన అనుభవం గురించి చెప్పండి?
- తనికెళ్ల భరణి గారు, నరేష్ గారు, అవసరాల శ్రీనివాస్ గారు అద్బుతమైన నటులు. వాళ్లంతా లెజెండ్స్.
- వెన్నెల కిషోర్ అద్భుతమైన ఆర్టిస్ట్. వైవా హర్షకు మంచి టైమింగ్ ఉంది.
- అందరూ సీనియర్లే అయినా మాతో కలిసి పోయి సరదాగా షూటింగ్ చేశారు.
సారంగపాణి జాతకం హీరోగా ఏమైనా ఒత్తిడి ఫీల్ అయ్యారా?
- సారంగపాణి జాతకం చిత్రం కోసం ఇంద్రగంటి గారే ఎక్కువగా కష్టపడ్డారు. ఈ చిత్రం నా కంటే ఆయనే ఎక్కువగా కష్టపడ్డారు.
- సెట్స్ మీదకు వచ్చి ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ పోయానంతే. నేను ఎప్పుడూ ఒత్తిడిగా ఫీల్ అవ్వలేదు.
ఇండస్ట్రీలోకి రాకముందు మీరు జాతకం చూపించుకున్నారా?
- ఇండస్ట్రీలోకి రాకముందు జాతకాలు చూపిస్తే అస్సలు నేను యాక్టర్‌ని అవ్వను అని చెప్పారు. కానీ నేను అవన్నీ పట్టించుకోలేదు.
- మా అమ్మ తన కొడుకు ఏమైపోతాడో అని అలా జాతకం చూపించారు. కానీ నేను నా మీద నమ్మకంతో వచ్చాను.
- చేసే పని మీద నేను నమ్మకం పెట్టుకుంటున్నానంతే.
సారంగపాణి జాతకం స్టోరీతో ముందుకు వెళ్లే సినిమానా? కారెక్టరైజేషన్‌తో ముందుకు వెళ్లే సినిమానా?
- కొన్ని సినిమాలు కారెక్టర్ల మీదే నడుస్తాయి. ‘కోర్ట్‘ చిత్రంలో నాతో పాటు అన్ని కారెక్టర్‌లు హైలెట్ అయ్యాయి.
- ఫైనల్‌గా సినిమాకు మంచి టాక్ వచ్చింది.. బ్లాక్ బస్టర్ అయింది. నేనున్నాను అని సినిమాకు జనాలు రావడం లేదు.
- నేను ఓ సినిమాను చేస్తున్నాను అంటే.. అందులో ఏదో ఒక మంచి పాయింట్, కంటెంట్ ఉంటుందని నమ్ముతున్నారు.
- ప్రస్తుతం ఆడియెన్స్ ఏ సినిమాని చూడాలి? ఏ సినిమాను చూడకూడదు అన్న ఫుల్ క్లారిటీతో ఉన్నారు.
- సినిమాలో విషయం ఉంటేనే జనాలు చూస్తున్నారు.
ఫ్లాప్స్ వచ్చినప్పుడు స్వీయ విమర్శ చేసుకుంటారా?
- సినిమా పోయినప్పుడు కచ్చితంగా నా తప్పుల్ని నేను సరిదిద్దుకుంటాను.
- ఎక్కడెక్కడ తప్పు చేశాం.. సినిమా ఎందుకు పోయింది.. ఇలా కాకుండా అలా చేసి ఉండాలి.. నెక్ట్స్ టైం జాగ్రత్తగా ఉండాలి అని నాకు నేనుగా విమర్శించుకుంటాను.
మాస్ ఇమేజ్ కోసం పరితపిస్తుంటారా?
- మన ఇండస్ట్రీలో యాక్షన్ హీరోలున్నారు. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రాలకు మంచి కలెక్షన్స్ కూడా వస్తుంటాయి.
- కానీ నాని గారు ‘దసరా‘ చేశారు. ఆ వెంటనే ‘హాయ్ నాన్న‘ అని కూడా చేశారు. అవి రెండు హిట్లే అయ్యాయి.
- ఒకప్పుడు చిరంజీవి గారు, రజినీకాంత్ గారు, బాలకృష్ణ గారు అదే ఫార్మాట్‌ను అనుసరించారు.
- అన్ని రకాల చిత్రాలను చేసి మెప్పించారు. నేను కూడా అలానే చేయాలని అనుకుంటున్నాను.
- శ్రీకాంత్ ఓదెల రెడీ అంటే కత్తి పట్టుకొంటా.. (సరదాగా నవ్వుతూ)..
ఇంద్రగంటి గారు మీకు ఈ కథను చెప్పినప్పుడు మీ నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి?
- ఇంద్రగంటి గారితో ఒక ఫోటో దిగితే చాలని అనుకునేవాడ్ని. కానీ అలాంటి ఆయనే కథను తీసుకొచ్చి చెప్పారు.
- కథ విన్నవెంటనే అద్భుతంగా అనిపించింది. జాతకాల పిచ్చోడు అంటూ కథ మొత్తాన్ని చెప్పారు.
- సారంగపాణి జాతకం అని టైటిల్ కూడా చెప్పారు. ఆ టైటిల్ కూడా నాకు చాలా నచ్చింది.
- టైటిల్ అద్భుతంగా ఉంది సర్ అని అన్నాను. ఇక ఆయనతో నా ఫస్ట్ డే షూటింగ్ అయితే ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
- ప్రతీ ఒక్కరికీ ఇంద్రగంటి గారితో పని చేసే అదృష్టం రావాలని కోరుకుంటున్నాను.
సారంగపాణి జాతకం నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ గారితో మీ అనుభవం గురించి చెప్పండి?
- శివలెంక కృష్ణ ప్రసాద్ గారు చాలా గొప్ప నిర్మాత. అప్పట్లోనే ‘ఆదిత్య 369‘ లాంటి గొప్ప చిత్రాన్ని నిర్మించారు.
- ఇప్పటికీ నాలాంటి కొత్త యాక్టర్‌లని కూడా సర్ అని పిలుస్తుంటారు. ఆయన ఎంతో హంబుల్‌గా ఉంటారు.
- ఆయన బ్యానర్‌లో పని చేసే అవకాశం రావడం నా అదృష్టం.
సారంగపాణి జాతకం కోసం ప్రీమియర్లు వేస్తున్నారా?
- సారంగపాణి జాతకం ప్రమోషన్స్ కోసం వైజాగ్‌కి వెళ్తున్నాం. అక్కడ ఈవెంట్లు కూడా చేస్తున్నాం.
- ప్రీమియర్లు కూడా వేయబోతున్నాం. మా సినిమాను కాస్త ముందుగానే చూపిస్తాం.
- నచ్చితే థియేటర్‌కు రండి అని చెబుతాం. మా సినిమా అందరినీ నవ్విస్తూ ఎంటర్టైన్ చేసేలా ఉంటుంది.
ప్రస్తుతం ఆడియెన్స్ టేస్ట్ మారిపోయిందని అంటున్నారు?
- ప్రస్తుతం జనాలు కంటెంట్ ఉన్న చిత్రాల్నే ఎంకరేజ్ చేస్తున్నారు.
- కామెన్ మెన్ కథల్నే జనాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
- లక్కీ భాస్కర్, పుష్ప వంటి చిత్రాల్లో కామన్ మెన్ హీరోగా మారుతాడు.
- అప్పట్లో చిరంజీవి గారు కూడా అదే ఫార్మాట్‌లో చాలా చిత్రాలు చేసి అందరినీ మెప్పించారు.
నెక్ట్స్ ప్రాజెక్టుల గురించి చెప్పండి?
- ఏషియన్ సినిమాస్‌లో ‘ ప్రేమంటే‘ అనే సినిమాను కొత్త దర్శకుడితో చేస్తున్నాను.
- గీతా ఆర్ట్స్‌లో బన్నీ వాస్ గారి నిర్మాణంలో ‘మిత్రమండలి‘ అనే మరో ప్రాజెక్టుని చేస్తున్నాను.
- ఇంకా కొన్ని కథలు వింటున్నాను. బలమైన పాత్రలుండే సినిమాల్ని ఎక్కువగా చేయాలని అనుకుంటున్నాను.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: