మోహన్ లాల్ ‘తుడరుమ్’ ట్రైలర్ రిలీజ్

Mohanlal and Shobana's Thudarum Telugu Trailer Released

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇటీవలే ‘L2: ఎంపురాన్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. దీని తర్వాత ఆయన చేస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘తుడరుమ్’. వెటరన్ హీరోయిన్ శోభన మోహన్ లాల్‌కి జోడిగా నటించారు. దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత వీరిద్దరూ కలిసి నటించడం విశేషం. తరుణ్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎం. రంజిత్ నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ఎమోషన్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రోలర్ కోస్టర్ రైడ్‌గా ట్రైలర్ కట్టిపడేసింది. మోహన్ లాల్ ట్యాక్సీ డ్రైవర్‌గా, ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపించిన తీరు ఆకట్టుకుంది. ఓ కారు, ఫ్యామిలీ చుట్టూ ఆసక్తికరంగా నడిచిన ట్రైలర్ సినిమాపై, కథపై చాలా క్యూరియాసిటీని పెంచింది.

మోహన్ లాల్ నేచురల్ అండ్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ హైలెట్‌గా నిలిచింది. మోహన్ లాల్, శోభన అన్ స్క్రీన్ కెమిస్ట్రీ బ్యూటీఫుల్‌గా వుంది. దర్శకుడు తరుణ్ మూర్తి కథని చాలా ఆసక్తికరంగా ప్రజెంట్ చేశాడు. జేక్స్ బిజోయ్ నేపధ్య సంగీతం ఎక్సయిటింగా వుంది. షాజీ కుమార్ సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్‌లో వుంది.

ట్రైలర్ అయితే ట్రెమండస్ రెస్పాన్స్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో దీపా ఆర్ట్స్ పి శ్రీనివాస్ గౌడ్ గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో మణియంపిల్ల రాజు, బిను పప్పు, ఇర్షాద్ అలీ, ఫర్హాన్ ఫాజిల్, థామస్ మాథ్యూ, షైజో ఆదిమాలి తదితరులు నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.