నేచురల్ స్టార్ నాని హిట్ 3 మరో 10రోజుల్లో థియేటర్లలోకి రానుంది.రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఆఫ్ లైన్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు నాని. అందులో భాగంగా నిన్న శ్రీనిధి శెట్టి తో కలిసి తమిళ మీడియా కు వరసగా ఇంటర్వ్యూలు ఇచ్చాడు.ఈ ప్రమోషన్స్ కోసం ప్రతేకమైన సెట్స్ వేశారు.ఇక ఈరోజు నాని, శ్రీనిధి శెట్టి ముంబై వెళ్లి హిందీలో ప్రమోట్ చేస్తున్నారు.రీసెంట్ గా సరిపోదా శనివారం, కోర్ట్ సినిమాలను కూడా గట్టిగా ప్రమోట్ చేశాడు నాని. ఈరెండు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.ఇక ఇప్పుడు హిట్ 3 నికూడా ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్రైలర్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.హిట్ టాక్ వస్తే నాని కెరీర్ లో హిట్ 3 అత్యధిక ఓపెనింగ్స్ ను రాబట్టనుంది.ఇక దసరా నుండి పాన్ ఇండియా విజయం కోసం పోరాడుతున్నాడు నాని.మరి హిట్ 3తో ఈ సారి ఆ విజయం దక్కుతుందో చూడాలి.
నాని కెరీర్ లోనే మోస్ట్ వైలెంట్ మూవీగా రూపొందుతుంది ఈసినిమా.అయితే ఫ్యామిలీ ప్రేక్షకుల్లో నానికి మంచి ఇమేజ్ వుంది.కానీ ఈసారి వారికి సూట్ అయ్యే కంటెంట్ తో రావడం లేదు.హిట్ 3 ని శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తుండగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది.మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.నానితో కలిసి ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు.
ఇక ఈసినిమా రిలీజ్ తరువాత నాని ది ప్యారెడైజ్ లో జాయిన్ కానున్నాడు.శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేయనుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ కానుంది.దసరా కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























