తెలుగు సినిమా ఆయనను నెత్తిన పెట్టుకోవడం ఖాయం

Director Sampath Nandi Praises Vasishta N Simha Acting in Odela 2

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన రూటు మార్చి తొలిసారి నాగసాధువుగా నటించిన చిత్రం ‘ఓదెల-2’. సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్‌గా సంపత్ నంది సూపర్ విజన్‌లో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ముఖ్యమైన పాత్రలు పోషించిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు పరమశివుడి దర్శనం కల్పించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినిమా చూసిని ప్రతి ప్రేక్షకుడూ డివైన్ ఫీల్‌తో బయటకు వచ్చి ఎంతో గొప్పగా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆదివారం ప్రసాద్ ల్యాబ్స్‌లో డివైన్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్‌లో ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నాయర్, ఫైట్ మాస్టర్ వెంకట్, ఎడిటర్ అవినాష్, ఆర్టిస్ట్ గగన్, డిస్ట్రిబ్యూటర్స్ శంకర్, సురేష్, నటి పూజ, విషిత, శ్రీధర్ రెడ్డి, బేబీ ఫేం ప్రభావతి, సిరి, నవీన్, ప్రియ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సంపత్ నంది మాట్లాడుతూ.. “యాక్టర్స్ విషయానికి వస్తే.. ఓదెల-2 అనుకోగానే తమన్నాను అనుకున్నాం. 20 ఏళ్ల తన కెరీర్ ఒకవైపు.. ఇందులో ఆమె క్యారెక్టర్ ఇంకోవైపు అని చెబుతున్నారు. దానికి అంత అద్భుతమైన నటన ఇచ్చిన తమన్నాకు, ఆమె టీమ్‌కు థ్యాంక్స్. తర్వాత వశిష్ట గారు నన్ను ఫ్యామిలీ అనుకుంటారు. ఆయన ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశారో తెలీదు కానీ.. ఈ సినిమా తర్వాత ఆయనకు అద్భుతమైన పాత్రలు వస్తాయి. తెలుగు సినిమా ఆయనను నెత్తిన పెట్టుకోవడం ఖాయం.” అని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “సమాధి శిక్ష సీన్స్ అంత బాగా పండడానికి కారణం గగన్. ప్రభావతి గారికి నేను ఫ్యాన్. ఆమె లేకుండా సినిమాలు చేయను. ఆమెకు చెప్పాల్సిన పని లేకుండా పాత్రకు న్యాయం చేస్తారు. మిగతా ఆర్టిస్టులంతా వాళ్ల పాత్రలకు చక్కగా న్యాయం చేశారు. డిస్ట్రిబ్యూటర్ శంకర్ గారికి థ్యాంక్స్” అని చెప్పారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.