ఓదెల 2.. రిలీజ్‌కు ముందే బ్రేక్ ఈవెన్ అయింది

Odela 2 Got Break Even Before Release, Says Director Sampath Nandi

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన రూటు మార్చి తొలిసారి నాగసాధువుగా నటించిన చిత్రం ‘ఓదెల-2’. సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్‌గా సంపత్ నంది సూపర్ విజన్‌లో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ముఖ్యమైన పాత్రలు పోషించిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు పరమశివుడి దర్శనం కల్పించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినిమా చూసిని ప్రతి ప్రేక్షకుడూ డివైన్ ఫీల్‌తో బయటకు వచ్చి ఎంతో గొప్పగా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆదివారం ప్రసాద్ ల్యాబ్స్‌లో డివైన్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్‌లో ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నాయర్, ఫైట్ మాస్టర్ వెంకట్, ఎడిటర్ అవినాష్, ఆర్టిస్ట్ గగన్, డిస్ట్రిబ్యూటర్స్ శంకర్, సురేష్, నటి పూజ, విషిత, శ్రీధర్ రెడ్డి, బేబీ ఫేం ప్రభావతి, సిరి, నవీన్, ప్రియ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఓదెల 2 క్రియేటర్ సంపత్ నంది మాట్లాడుతూ.. “ఏడాదిన్నర క్రితం ఈ సినిమా జర్నీ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఈ రోజు వరకూ ఏదో జరిగింది. ప్రతి మూమెంట్ ఏదీ మేము ప్లాన్ చేసింది కాదు. దానంతట అదే జరిగిపోయింది. ఆ పరమ శివుడు లేకుండా ఈ సినిమా ఐడియా లేదు. ఈ సినిమా ఐడియా చెప్పగానే నిర్మాత మధు గారు దేనికీ వెనకాడకుండా చేద్దామన్నారు.”

“అజనీష్ గారు ఇచ్చిన మ్యూజిక్‌కి గూస్‌బంప్స్ వచ్చాయి. డీఓపీ సౌందర్ రాజన్‌తో పదేళ్ల పాటు పని చేస్తున్నా. ఆయన లేకుండా ఏ సినిమా చేయలేదు. ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నాయర్ చాలా అద్భుతంగా సెట్స్ వేసి ఇచ్చారు. ఎడిటర్ అవినాష్ వాన పాట కట్‌ నుంచి నాకు తెలుసు. వీళ్లందరికీ థ్యాంక్స్. ఈ సినిమాకు పని చేసిన ప్రతి టెక్నీషియన్‌కు పేరు పేరున థ్యాంక్స్.”

“ఈ సినిమా బడ్జెట్ మీరు అనుకున్న బడ్జెట్ కాదు. రిలీజ్‌కు ముందే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. మాకు ప్రేక్షకుల రూపంలో వచ్చే ప్రతి రూపాయి కూడా ఆ పరమాత్ముడు ఇచ్చే ప్రసాదంగా భావిస్తాం. ఈ సినిమా ఆల్రెడీ సక్సెస్ బాటలో వెళ్తోంది. అందుకు ముఖ్య కారణం సీజీ కూడా. చాలా తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన సీజీ చేశారు. దీనికి కారణం ప్రసాద్ ల్యాబ్స్. వాళ్లందరికీ థ్యాంక్స్. సినిమా చూడని వాళ్లు తప్పకుండా థియేటర్‌కు వెళ్లి చూస్తారని, ఆ శివ దర్శనాన్ని దర్శించుకుని ధన్యులవుతారని భావిస్తూ థ్యాంక్యూ సోమచ్” అని తెలిపారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.