సూపర్ స్టార్ రజినీకాంత్ ఐకానిక్ మూవీ బాషా తెలుగులో రీ రిలీజ్ కానుంది.ప్రస్తుతం కొత్త సినిమాల విడుదల తగ్గిపోవడంతో రీ రిలీజ్ ట్రెండ్ ఊపందుకుంది.ఈ నేపథ్యంలో బాషా రీ రిలీజ్ అవుతుంది.ఈసినిమా రీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా ఈనెల 25న మళ్ళీ థియేటర్లలోకి వస్తుంది. ప్రముఖ మీడియా కంపెనీ మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో బాషా రీ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
1995 లో విడుదలైన ఈసినిమా సెన్సేషన్ సృష్టించింది.ఈసినిమాతో రజినీకాంత్ కు తెలుగులోకూడా భారీ ఫాలోయింగ్ వచ్చింది. బాషా తో తన ఇమేజ్ పూర్తిగా మారిపోయింది.ముంబై గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో సురేష్ కృష్ణ తెరకెక్కించిన ఈసినిమాలో నగ్మా హీరోయిన్ గా నటించగా రఘువరన్ విలన్ పాత్రలో కనిపించారు.దేవా ఈసినిమాకు సంగీతం అందించగా సత్య మూవీస్ నిర్మించింది.
ఇక రజినీకాంత్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో కూలీ ఒకటి. షూటింగ్ కూడా పూర్తి కావొచ్చింది.లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తుండగా కింగ్ నాగార్జున , ఉపేంద్ర , శృతి హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఈసినిమాతోపాటు పాటు ప్రస్తుతం రజినీ, జైలర్ 2 లో కూడా నటిస్తున్నారు. నెల్సన్ డైరెక్ట్ చేస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఈరెండు సినిమాలపై భారీ అంచనాలు వున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: