ట్యాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర ప్రధానపాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్లైండ్ స్పాట్’. మ్యాంగో మాస్ మీడియా బ్యానర్‌పై రామ కృష్ణ వీరపనేని నిర్మించిన ఈ సినిమాకి రాకేష్ వర్మ దర్శకత్వం వహించాడు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రాశి సింగ్, అలీ రెజా, రవివర్మ, గాయత్రి భార్గవి కీలక పాత్రలో కనిపిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలాగే కిషోర్ కుమార్, హారిక పేడాడ, గురురాజ్ మానేపల్లి, హర్ష్ రోషన్, మాస్టర్ అభిషిక్త్ వంటి తారాగణం నటిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. ట్రైలర్ పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేయడంతో బ్లైండ్ స్పాట్ మంచి అంచనాలతో విడుదలకు సిద్ధమవుతోంది.
‘బ్లైండ్ స్పాట్’ ట్రైలర్ హైలైట్స్
ట్రైలర్ ఒక థ్రిల్లింగ్ సన్నివేశంతో ప్రారంభమవుతుంది. పనిమనిషి తన భుజాలపై ఒక బిడ్డతో బెడ్రూమ్లోకి వెళుతుంది. ఓ మహిళ నిర్జీవంగా ఉరి వేసుకున్న దృశ్యం చూసి భయపడుతుంది. పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ వచ్చి కేసుని పరిశీలిస్తాడు. ఇది ఆత్మహత్య కాదు హత్యని చెబుతాడు. తరువాత ప్రతి పాత్ర సిక్రెట్ కలిగి వుంటుంది. నిజమైన హంతకుడు ఎవరు? అనే క్యురియాసిటీని క్రియేట్ చేస్తూ చాలా ఎక్సయిటింగ్ ప్రజెంట్ చేశారు.
దర్శకుడు రాకేష్ వర్మ ట్రైలర్‌ను తొలి ఫ్రేమ్ నుంచే ఉత్కంఠను పెంచుతూ, ప్రేక్షకులను ఆద్యంతం థ్రిల్ లో ఉంచారు. నవీన్ చంద్ర తన పాత్రకు ఇంటెన్స్ అండ్ డెప్త్ యాడ్ చేసి సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక దర్శన్ ఎం అంబట్ సినిమాటోగ్రఫీ విజువల్స్‌తో ప్రత్యేకంగా నిలుస్తుండగా, శ్రీ రామ్ మద్దూరి గ్రిప్పింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టెన్షన్ ని పెంచుతుంది. ఎడిటర్ సత్య జి కట్ గ్రిప్పింగ్ గా వుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























