రివ్యూ : అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి

Arjun Son Of Vyjayanthi review in telugu

నటీనటులు : కళ్యాణ్ రామ్ , సయీ మంజ్రేకర్ , విజయశాంతి , సోహైల్ ఖాన్
ఎడిటింగ్ : తమ్మిరాజు
సంగీతం : అజనీష్ లోక్ నాథ్
దర్శకత్వం :ప్రదీప్ చిలుకూరి
నిర్మాతలు : అశోక్ ,సునీల్ బలుసు

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డెవిల్ తరువాత నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి.లెజండరీ నటి విజయశాంతి కీలక పాత్రలో నటించడం, ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాకు హైప్ వచ్చింది. ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. క్లైమాక్స్ డిఫరెంట్ గా ఉంటుందని పదే పదే చెప్పొకొచ్చారు.ఇక ఈసినిమా ఈ రోజే థియేటర్లలోకి వచ్చింది.మరి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఎలా వుంది? క్లైమాక్స్ ఆకట్టుకుందో లేదో ఇప్పుడు చూద్దాం.

కథ :

సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసరైనా వైజయంతి (విజయశాంతి) తన కొడుకు అర్జున్ ( కళ్యాణ్ రామ్) ని కూడా తనలాగే పోలీస్ ను చేయాలనుకుంటుంది.అయితే కొన్ని కారణాల వల్ల అర్జున్ రౌడీ గా మారి  వైజాగ్ ను శాసిస్తాడు. అర్జున్ కు తన తల్లంటే విపరీతమైన ప్రేమ.ఇక వైజయంతి ముంబై గ్యాంగ్ స్టర్ అయినా సోహాల్ ఖాన్ కు ఎదురెళ్లడంతో ఆపదలో చిక్కుకుంటుంది.ఈక్రమంలో అర్జున్ తన తల్లిని ఎలా కాపాడుకున్నాడు.ఇంతకీ అర్జున్ రౌడీగా ఎందుకు మారాల్సివచ్చింది అనేది మిగితా కథ.

విశ్లేషణ :

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రెగ్యులర్ యాక్షన్ ఎంటర్టైనర్ అనే టెంప్లెట్ తో వచ్చినా ఎగేజింగ్ స్క్రీన్ ప్లే తో సినిమా ఆకట్టుకుంది.పెద్దగా ట్విస్టులు ,సప్రైజ్ లు ఏమి లేకున్నా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగింది.ఫస్ట్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు మాస్ ప్రేక్షకులను మెప్పిస్తాయి.ఇక సెకండ్ హాఫ్ కూడా ఎమోషనల్ , అలాగే యాక్షన్ సన్నివేశాలతో ఎంగేజింగ్ చేసి డీసెంట్ అనిపిస్తుంది.

ముఖ్యంగా క్లైమాక్స్ అయితే దాదాపు అరగంటపాటు సుదీర్ఘంగా సాగతుంది.చివర్లో వచ్చే ఓ సీన్ చాలా హై ఇస్తుంది.బహుశా చిత్ర బృందం కూడా దీన్ని ఎక్కువగా నమ్మి ప్రచారం చేశారు.ప్రమోషన్స్ లో చెప్పినట్లు క్లైమాక్స్ మెప్పిస్తుంది.యాక్షన్ పార్ట్ ను అయితే చాలా బాగా డీల్ చేశాడు దర్శకుడు. ఓవరాల్ గా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి డీసెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ అనిపించుకుంది.

నటీనటులు విషయాన్ని వస్తే అర్జున్ పాత్రలో కళ్యాణ్ రామ్ అదరగొట్టాడు.స్క్రీన్ మీద చాలా స్టైలిష్ గా కనిపించాడు.కళ్యాణ్ రామ్ కు ఇలాంటి పాత్రలు కొత్తేమి కాదు.అర్జున్ పాత్ర తనకు బాగా సూట్ అయ్యింది. ఇక కీలక పాత్రలో కనిపించిన విజయశాంతి పవర్ ఫుల్ యాక్టింగ్ తో మెప్పించారు.తన ఇమేజ్ కు తగ్గ పాత్ర పడింది. హీరోయిన్ గా సయీ మంజ్రేకర్ పెద్దగా చేసింది ఏం లేకపోయినా గ్లామర్ గా కనిపించింది.విలన్ పాత్రలో సోహాల్ ఖాన్ సూపర్ అనిపించాడు. అయితే ఆ పాత్రను ఇంకొంచెం బలంగా రాసుకోవాల్సింది.కీలక పాత్రల్లో కనిపించిన శ్రీకాంత్ ,పృథ్వీరాజ్ తమ అనుభవాన్ని చూపించారు.

టెక్నికల్ గా కూడా సినిమా పర్వేలేదు అనిపించింది.అజినీష్ లోక్ నాథ్ పాటలు ఓకే ఓకే అనిపించినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ గా ఇచ్చాడు.సినిమాటోగ్రఫీ బాగుంది.విజువల్స్ క్వాలిటీగా వున్నాయి.ఎడిటింగ్ పర్వాలేదు.సినిమాకు నిర్మాతలు బాగానే ఖర్చు చేశారు.తెర పై క్వాలిటీ మేకింగ్ కనిపించింది.

ఓవరాల్ గా మంచి అంచనాల మధ్య వచ్చిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి డీసెంట్ ఎంటర్టైనర్ అనిపించుకుంది.కళ్యాణ్ రామ్ ,విజయశాంతి నటన ,బీజీఎమ్ ,యాక్షన్ సీన్స్ , క్లైమాక్స్ సినిమాలో హైలైట్ అయ్యాయి.యాక్షన్ లవర్స్ కు ఈసినిమా బాగా నచ్చుతుంది.మిగతా వారు కూడా ఓసారి చుడొచ్చ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.