అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఫస్ట్ చూసింది ఎన్టీఆర్ గారే :ప్రొడ్యూసర్స్ సునీల్ బలుసు, అశోక్ వర్ధన్ ముప్పా

producers sunil balusu and ashok talks about Arjun Son Of Vyjayanthi

నందమూరి కళ్యాణ్ రామ్ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా అర్జున్ S/O వైజయంతి .ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్ర చేశారు. ట్రైలర్ తో అంచనాలు పెరిగిపోయాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు.ఈనెల 18న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అర్జున్ S/O వైజయంతి మూవీ ఎలా స్టార్ట్ అయింది?

కళ్యాణ్ రామ్ గారితో ఒక సినిమా చేయాలనుకున్నాం.ఆయన ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ ఎక్కువగా చేస్తున్నారు. ఒక మాస్ కమర్షియల్ సినిమాని ఆయనతో చేయాలని ఈ కథని సిద్ధం చేయించాం. కథ ఆలోచన దగ్గర నుంచి ప్రతిదీ కళ్యాణ్ రామ్ గారి కోసం తయారుచేసినవే. మదర్ క్యారెక్టర్ ను విజయశాంతి గారు చేయాలని ముందే ఫిక్స్ అయ్యాం. అన్ని ప్లాన్ చేసుకుని చేసిన సినిమా ఇది. మంచి ఎమోషనల్ యాక్షన్ ఫిల్మ్.

దర్శకుడిగా ప్రదీప్ గారిని ఎంపిక చేసుకోడనికి కారణం?

ప్రదీప్ గారితో నేనొక వెబ్ ఫిల్మ్ చేశాను. ఆయనతో నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అయినా కమర్షియల్ మీటర్ తెలిసిన డైరెక్టర్. ఈ కథకు ఆయన బెటర్ అనిపించింది. హై ఎమోషన్ వున్న ఈ సినిమాని ఆయన అద్భుతంగా తీశారు.

అశోక్ గారు మీరు అలా ఎలా సినిమా చేసి పదేళ్లు అవుతుంది. మళ్లీ ఈ సినిమా చేయడం ఎలా అనిపించింది?

అలా ఎలా సినిమా నా ఫ్రెండ్ అనీస్ కోసం చేశాను. అందులో సునీల్ కూడా ఉన్నారు. ఆ సినిమాని సునీల్ నే ప్రమోట్ చేశారు. కళ్యాణ్ గారు నా ఫ్రెండ్. అందరం కలసి ఒక సినిమా చేద్దామని ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది.

విజయశాంతి గారి పాత్ర గురించి?

లేడీ పోలీస్ ఆఫీసర్ అనగానే విజయశాంతి గారే గుర్తుకు వస్తారు. కర్తవ్యం సినిమా స్ఫూర్తితో తీర్చిదిద్దిన పాత్రలో కనిపిస్తారు. ఈ కథని ఆమె ఓకే చేస్తారని మాకు గట్టి నమ్మకం. మా నమ్మకం ప్రకారం ఈ సినిమాని ఆమె ఒప్పుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇందులో చాలా పవర్ ఫుల్ రోల్ చేశారు.

సినిమాకి చాలా బడ్జెట్ అయ్యిందని విన్నాం.. కొత్త దర్శకుడితో ఇంత స్కేల్ లో చేయడం రిస్క్ అనిపించలేదా?

కళ్యాణ్ రామ్ గారితో ఒక మంచి మాస్ యాక్షన్ కమర్షియల్ సినిమా చేయాలని అనిపించింది. దానికి తగ్గట్టుగా ఎక్కడా కాంప్రమైస్ కాకుండా ఈ సినిమాను నిర్మించాం. ముందు మేము ఈ కథని నమ్మాం. కథకు కావాల్సినది ఖర్చు చేశాం. ఖర్చు చేసిన ప్రతి రూపాయి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది.

ఫైనల్ అవుట్ ఫుట్ చూసుకున్నాక మీ అంచనాలు అందుకున్నట్లు అనిపించిందా?

ఖచ్చితంగా. మేము అనుకున్న దాని కంటే సినిమా చాలా అద్భుతంగా వచ్చింది.

ఎన్టీఆర్ సినిమా చూసి మీతో ఏం షేర్ చేసుకున్నారు ?

సినిమా ఫస్ట్ చూసింది ఎన్టీఆర్ గారే. ఆయన చూసిన తర్వాత చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఎమోషనల్ యాక్షన్ బెస్ట్ ఉందని చెప్పాను. రికార్డింగ్ దగ్గర కాంప్రమైజ్ కాకుండా చూకోమని చెప్పారు. అజీనిష్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఎన్టీఆర్ గారు చెప్పినట్లు చివరి ఇరవై నిముషాలు కళ్ళు చెమ్మగిల్లెలా వుంటుంది. ఇలా రావడానికి కారణం సినిమా బిగినింగ్ నుంచి బిల్డ్ చేసిన ఎమోషన్. ఎన్టీఆర్ గారు చెప్పినట్టు సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది.

ఇందులో మీకు బెస్ట్ అనిపించిన ఎపిసోడ్ ఏమిటి?

ఇందులో మూడు ఎపిసోడ్లు ది బెస్ట్ అనిపించాయి. ఈ మూడు ఎపిసోడ్లు కూడా సెకండ్ హాఫ్ లో వస్తాయి మూడు కూడా దేనికవే ప్రత్యేకంగా ఉంటాయి.

మీరు ఇద్దరు ప్రొడ్యూస్ చేశారు కదా.. మీ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రాలేదా?

మేము ఎప్పటినుంచో ఫ్రెండ్స్. మా ఇద్దరికీ ఒక మంచి వేవ్ లెంత్ వుంది. అందుకే కలిసి వర్క్ చేయగలుగుతున్నాం,.

సునీల్ గారు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటి?

మూడు సినిమాలు ఉన్నాయండి. జగుతున్నాయి ?

అశోక్ గారు నెక్స్ట్ ఏం చేస్తున్నారు? ఎలాంటి సినిమాలు చేయబోతున్నారు?

ఈసారి నా నుంచి రెగ్యులర్ గా సినిమాలు వస్తాయి. నాకు పర్సనల్ గా థ్రిల్లర్స్ ఇష్టం.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.