నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘అర్జున్ S/O వైజయంతి’. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ఈ రెండు పాత్రలు మధ్య డైనమిక్స్ కీలకంగా వుండబోతున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ‘అర్జున్ S/O వైజయంతి’ టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఆలోచన ఎలా వచ్చింది? కళ్యాణ్ రామ్ గారిని ఎలా అప్రోచ్ అయ్యారు?
- కళ్యాణ్ రామ్ గారితో సినిమా చేయాలని ప్రొడ్యూసర్స్ అనుకున్నారు. అప్పటికే కళ్యాణ్ రామ్ గారు ‘డెవిల్, అమిగోస్’ లాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేసి ఉన్నారు. ముందుగా మాస్ సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాము. మాస్ జోనర్‌లో హీరో క్యారెక్టర్‌ని తయారు చేశాను.
- తర్వాత ఒక పవర్ఫుల్ మదర్ క్యారెక్టర్‌ని అనుకున్నాం. ఈ మదర్ వైజయంతి లాంటి పవర్‌ఫుల్ క్యారెక్టర్ అయితే బాగుంటుందని అనుకున్నాం. ముందు హీరో గారికి చెప్పాం. ఆయన చేద్దాం అన్నారు కానీ, విజయశాంతి గారు ఒప్పుకుంటేనే చేద్దాం అని క్లియర్‌గా చెప్పారు.
- విజయశాంతి గారికి కథ చెప్పాం. మేడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చిన్న కరెక్షన్స్ చెప్పారు. ఆ మార్పులు చేసిన తర్వాత సెట్స్ మీద తీసుకువెళ్లాం.
ఇందులో మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ఏమిటి?
- హీరో క్యారెక్టర్ అండ్ మదర్ క్యారెక్టర్ ఎవరి ఐడియాలజీలో వాళ్ళు కరెక్ట్‌గా ఉంటారు. అక్కడి నుంచే కాన్‌ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుంది. ఈ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్.
-విజయశాంతి గారు ఫైట్ సీక్వెన్స్ చాలా అద్భుతంగా చేశారు. విజయశాంతి గారు కథ విన్నప్పుడే తాను ఫైట్స్‌కి సిద్ధమని చెప్పారు.
మీరు రాజా చెయ్యి వేస్తే సినిమా చేశారు ఆ తర్వాత ఇంత గ్యాప్ రావడానికి కారణం?
- కథలు ఓకే అయ్యాయి. ఒక పెద్ద హీరో సినిమాకి అడ్వాన్స్‌లు ఇచ్చి కూడా తర్వాత కొన్ని కారణాల వల్ల ఆగాం. అలాగే యువీ క్రియేషన్‌లో ఒక కథ కోసం మూడేళ్లు పాటు కూర్చున్నాం. అది నెక్స్ట్ చేయబోతున్నాం.
- అలాగే అనిల్ సుంకర బ్యానర్‌లో ఏడాదిన్నర పాటు ఒక కథ మీద వర్క్ చేయడం జరిగింది. ఎప్పుడు స్టార్ట్ అయినా పెద్ద సినిమాలౌతాయి.
ఈ సినిమా క్లైమాక్స్ గురించి చాలా గొప్పగా చెబుతున్నారు అది ఎలా ఉండబోతుంది?
- మదర్ కోసం ఎంత త్యాగం చేయొచ్చు అది ఆడియన్స్ చూస్తారు. చాలా ఎమోషనల్‌గా ఉంటుంది.
సినిమా బిజినెస్ ఎలా ఉంది?
- చాలా బాగుంది. ప్రొడ్యూసర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. సినిమాకి చాలా మంచి బజ్ ఉంది .
ఎన్టీఆర్ గారు కళ్యాణ్ అన్న కాలర్ ఎగరేస్తాడు అని చెప్పారు ఆ నమ్మకం ఎలా వచ్చింది?
- ఎన్టీఆర్ గారు సినిమా చూశారు. చూసిన తర్వాత వచ్చిన కాన్ఫిడెన్స్ అది.
సాయి మంజ్రేకర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
- ఎమోషనల్ యాక్షన్ ఫిలిం ఇది. అలాంటి సీరియస్ ఫిలింలో కాస్త కూల్ బ్రీజా ఉండే క్యారెక్టర్ తనది. తన క్యారక్టర్‌కి ఒక ఇంపార్టెన్స్ ఉంది.
ఎన్ని ఫైట్స్ ఉన్నాయి ? ఎలా డిజైన్ చేశారు?
- విజయశాంతి గారి ఫస్ట్ యాక్షన్ సీక్వెన్స్ పృథ్వి మాస్టర్ చేశారు. రామకృష్ణ మాస్టారు ఇంటర్వెల్, క్లైమాక్స్ రెండు ఫైట్లు చేశారు. పీటర్ మాస్టర్ హీరో ఇంట్రడక్షన్ క్లైమాక్స్ ఫైట్ చేశారు.
- అలాగే విలన్ సీక్వెన్స్ రెండు రఘువరణ్ మాస్టర్ చేశారు. ఫైట్లన్నీ చాలా అద్భుతంగా వుంటాయి.
విజయశాంతి గారు కథని ఒప్పుకున్న తర్వాత కచ్చితంగా మీ మీద ఒక బాధ్యత, అదే సమయంలో భయం కూడా ఉంటుంది కదా?
- భయం ఏమి లేదండి. కాన్ఫిడెంట్‌గా చెప్పాం. కాన్ఫిడెన్స్‌గా చేశాం. నిజానికి విజయశాంతి గారిని నేనే ఇబ్బంది పెట్టాను.
ఇందులో ఒక ఫారెస్ట్ సీక్వెన్స్ ఉంది. ఆ సీన్‌లో ఓ రెండు గంటల పాటు అడవిలోని బురదలో అలాగే ఉండిపోయారు. - షాట్ పూర్తి అయ్యేవరకు అలాగే బురదలో పడుకున్నారు. ఆ సీన్ ఫినిష్ చేసి కార్వాన్ లోకి వెళ్ళిన తర్వాత మేడం గారికి ఫుల్‌గా జ్వరం వచ్చింది. చేయి వణుకుతుంది. జ్వరం ఉన్నప్పటికీ కూడా ఆ సీన్ అయ్యేవరకు అక్కడ నుంచి కదల్లేదు. అంత డెడికేటెడ్‌గా వర్క్ చేశారు.
- మేడం గారి సీనియారిటీ ఈ సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. ఆవిడ పర్ఫామెన్స్ చూసిన తర్వాత చాలా చోట్ల నాకు గూస్ బంప్స్ వచ్చాయి. వేరే లెవల్లో పెర్ఫార్మన్స్ చేశారు. కళ్యాణ్ రామ్ గారు, విజయశాంతి గారు పోటీపడి యాక్ట్ చేశారు.
ప్రొడ్యూసర్స్ సపోర్ట్ ఎలా ఉంది?
- ప్రొడ్యూసర్ చాలా సపోర్ట్ చేశారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని తీశారు. ఎక్కడ వెనకడుగు వేయలేదు. అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు.
అజినీష్ గారి మ్యూజిక్ గురించి?
- రెండు సాంగ్స్ చాలా బాగున్నాయి. రీ రికార్డింగ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. కళ్యాణ్ రామ్ గారికి, విజయశాంతి గారికి, విలన్‌కి, ప్రతి క్యారెక్టర్‌కి ఒక డిఫరెంట్ సౌండ్ ట్రాక్‌ని క్రియేట్ చేశారు.
కళ్యాణ్ రామ్ గారి స్ట్రెంత్ ఏంటి?
- ఆయన బలం ఎమోషన్. ఎమోషన్‌ని అదరగొట్టేస్తారు.
ఈ కథలో మెయిన్ ఎమోషన్ ఏమిటి?
- తల్లితండ్రులు మన బర్త్ డేని ఒక సెలబ్రేషన్స్‌లా చేస్తారు. తల్లిదండ్రుల బర్త్ డేని మనం సెలబ్రేట్ చేయడం ఒక ఎమోషన్. అదే ఈ సినిమాలో చెప్పాలనుకున్నాను.
కళ్యాణ్ రామ్ గారు, ఎన్టీఆర్ గారి ఫాన్స్ ఈ సినిమా నుంచి ఎలాంటి ఎలిమెంట్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు?
- అద్భుతమైన ఎమోషన్ ఉన్న సినిమా ఇది. అభిమానులు మంచి ఎమోషన్‌నిని ఆశించవచ్చు.
మీ బలం ఏమిటి?
- ఎమోషన్ నా బలం. నేను నెక్స్ట్ చేయబోయే సినిమాలు కూడా ఎమోషనల్ గానే ఉంటాయి.
ఆల్ ది బెస్ట్..
థాంక్ యూ.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























