నందమూరి కళ్యాణ్ రామ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మరో 6 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. టీజర్ సినిమా కు బజ్ తీసుకొచ్చింది. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు.అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుతున్నారు. దీనికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ ఈవెంట్ లో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది.యాక్షన్ ప్యాక్డ్ గా ట్రైలర్ ను కట్ చేశారు. ట్రైలర్ అయితే సినిమా హిట్ అనేలా వుంది.
ప్రదీప్ చిలుకూరి తెరకెక్కించిన ఈసినిమాలో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటించారు. సరిలేరు నీకెవ్వరు తో రీ ఎంట్రీ తరువాత తనకు ఇది రెండో సినిమా .శ్రీకాంత్,యానిమల్ పృథ్వీ రాజ్, సోహైల్ ఖాన్ ముఖ్య పాత్రలు పోషించారు.అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: