అంచనాలు పెంచేస్తున్న నవీన్ చంద్ర ‘బ్లైండ్ స్పాట్’

Naveen Chandra's Blind Spot Creates Curiosity With First Look

టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటులలో యంగ్ హీరో నవీన్ చంద్ర ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేయడం ఆయన ప్రత్యేకత. ‘అందాల రాక్షసి’ సినిమాతో హీరోగా గుర్తింపు పొందిన నవీన్ చంద్ర ఆ తర్వాత పలు చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. అయితే తను కేవలం హీరో పాత్రలకే పరిమితమవకుండా వైవిధ్యభరిత పాత్రలలో సైతం నటిస్తుండటం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగా నేచురల్ స్టార్ నాని ‘నేను లోకల్’, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘అరవింద సమేత’.. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘గేమ్ ఛేంజర్’ వంటి సినిమాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్‌లో కనిపించి మంచి నటుడు అనిపించుకున్నారు. ఈ క్రమంలో ఈ యంగ్ హీరో ఇప్పుడు మరో థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యాడు.

ప్రస్తుతం నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్లైండ్ స్పాట్’. ఇటీవలే శ్రీరామ నవమి కానుకగా మేకర్స్ ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. యంగ్ డైరెక్టర్ రాకేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాశి సింగ్ ఫిమేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా, రవి వర్మ, గాయత్రి భార్గవి, కిషోర్ కుమార్, హారిక. పేడాడ, హర్ష రోషన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

కాగా ఈ బ్లైండ్ స్పాట్ చిత్రాన్ని మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో రామకృష్ణ వీరపనేని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ గ్రాండ్‌ థియేట్రికల్ రిలీజ్ చేస్తోంది. ఈ సినిమాకి శ్రీరామ్ మద్దూరి సంగీతం అందిస్తుండగా.. దర్శన్ ఎమ్ అంబట్ సినిమాటోగ్రఫీ, సత్య. జి ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. ఇక ఈ చిత్రం నవీన్ చంద్ర కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలిచిపోయేలా మేకర్స్ దీనిని రూపొందిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.