కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌తో పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందించిన బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. టి-సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పించిన ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహించారు. త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటించగా.. అర్జున్ దాస్, ప్రసన్న, సునీల్, ప్రభు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విడుదలకు ముందే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ సహా ఇతర ప్రచార చిత్రాలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య గుడ్ బ్యాడ్ అగ్లీ దాదాపు 2 గంటల 19నిమిషాల నిడివితో ఈనెల 10న థియేటర్లలోకి వచ్చింది. ఫస్ట్ షో తోనే బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న ఈ చిత్రం తమిళనాడు వ్యాప్తంగా తొలిరోజు 30.9 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సెన్సేషన్ సృష్టించింది.
కాగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ భారీ బడ్జెట్‌తో గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించారు. ఈ హైలీ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్‌లో టాప్ టెక్నికల్ టీం వర్క్ చేసింది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించగా.. అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ నిర్వహించారు. అలాగే విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్, జి ఎం శేఖర్ ప్రొడక్షన్ డిజైన్‌ను పర్యవేక్షించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: