విశ్వంభర ఫస్ట్ సింగిల్ ‘రామ రామ’ రిలీజ్

Vishwambhara First Single Rama Raama Released

మెగాస్టార్ చిరంజీవి హైలీ యాంటిసిపేటెడ్ క్రేజీ సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ ప్రధాన కథానాయికలుగా నటిస్తుండగా, కునాల్ కపూర్ పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేయగా.. దసరా సందర్భంగా విడుదలచేసిన టీజర్ టాప్ ట్రెండింగ్‍లో నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా విశ్వంభర నుండి అభిమానులకు సర్‌ప్రైజ్ అందించింది చిత్ర యూనిట్. శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా ఈ మూవీ నుంచి ‘రామ రామ’ అనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసింది. ఇది హనుమంతునికి శ్రీరాముడి పట్ల ఉన్న అచంచలమైన ప్రేమ, భక్తిని అందంగా చూపించే ఘన నివాళి. ఈ పాట సోల్ ఫుల్ ఫీమేల్ వాయిస్ తో ప్రారంభమవుతుంది. మెగాస్టార్ చిరంజీవి పవర్ ఫుల్ వాయిస్ “జై శ్రీ రామ్” అనే నినాదాన్ని ప్రతిధ్వనిస్తుంది.

శ్రీరాముడు, సీతా కళ్యాణం వేడుకల నేపథ్యంలో సాంగ్ విజువల్ ఫీస్ట్ లా వుంది. హనుమాన్ జయంతికి ఇది పర్ఫెక్ట్ సాంగ్. చిరంజీవి ఎప్పటిలాగే తన చరిష్మాటిక్ ప్రజెన్స్ తో అదరగొట్టారు. గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ తో అలరించారు. హనుమంతుడిగా అలంకరించబడిన పిల్లల ప్రజెన్స్ భక్తిని జోడిస్తుంది. హృదయాన్ని హత్తుకునే క్షణంలో హీరో పవిత్ర ఉత్సవానికి శ్రీ హనుమంతునిని ఆహ్వానిస్తాడు. ఈ పాటలో భావోద్వేగం, భక్తిశ్రద్ధను మరింతగా పెంచుతుంది.

మొత్తం పాట ఓ గ్రాండ్ సెటప్‌ లో చిత్రీకరించారు. ఇది ఆధ్యాత్మిక సంప్రదాయాల సారాన్ని అద్భుతంగా చూపించింది. మ్యూజికల్ జీనియస్ ఎం.ఎం. కీరవాణి, ఆధ్యాత్మిక, దైవిక శక్తితో నిండిన అద్భుతమైన సాంగ్ కంపోజ్ చేశారు. లెజెండరీ సింగర్ శంకర్ మహాదేవన్, సింగర్ లిప్సిక ఈ ట్రాక్‌కు తమ ఎనర్జిటిక్ వోకల్స్ అందించారు. లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి భక్తి, సాంస్కృతిక గొప్పతనాన్ని కవితాత్మకంగా అందించారు.

ఇక ఈ చిత్రానికి చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ, ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి ఎడిటర్స్ కాగా, సుస్మిత కొణిదెల స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. UV క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా.. విక్రమ్‌రెడ్డి సమర్పిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.