బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో నటించిన సినిమా జాట్. మైత్రి మూవీ మేకర్స్ ,పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించాయి.ఇక నిన్న ఈసినిమా హిందీలో రిలీజ్ అవ్వగా పాజిటివ్ రివ్యూస్ ను తెచ్చుకుంది దాంతో తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 11.6కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు.హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సినిమా రూపొందించాడు దర్శకుడు గోపిచంద్ మలినేని.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సన్నీ డియోల్ ను నెవెర్ బిఫోర్ రోల్ లో చూపించడంతో డైరెక్టర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.అలాగే విలన్ పాత్రలో రణదీప్ హూడా అదరగొట్టగా తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్ గా నిలిచింది.మరి ఫుల్ రన్ లో ఈసినిమా ఏ రేంజ్ వసూళ్లను రాబట్టుకుంటుందో చూడాలి.గోపిచంద్ మలినేని తోపాటు మైత్రి . పీపుల్ మీడియా కు హిందీ లో ఇదే మొదటి సినిమా.
హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో రెజీనా కసాండ్రా ,సయామి ఖేర్, రమ్యకృష్ణ ,జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. మరి ఈసినిమాను తెలుగులోకూడా రిలీజ్ చేస్తారో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: