పెద్ది గ్లింప్స్ రిలీజ్

Global Star Ram Charan's Peddi Glimpse Released

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’. నేషనల్ అవార్డ్ విన్నర్ ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చి బాబు సానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ పాన్-ఇండియా స్పెక్టికల్‌ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం నుంచి ఇటీవల హీరో రామ్ చరణ్‌ జన్మదినం సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ శ్రీరామనవమి సందర్భంగా హీరో రామ్ చరణ్‌ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ రామ్ చరణ్ క్యారక్టర్ ఎలా ఉండబోతుందో తెలియజేసేలావుంది. రా అండ్ రగ్గడ్ లుక్‌లో చరణ్ ఫుల్ మాస్ అండ్ పవర్ ఫుల్ క్యారక్టర్ చేయనున్నట్టు అర్ధమవుతోంది.పెద్ది గ్లింప్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా స్కై లెవెల్‌కి తీసుకెళ్లిందని చెప్పొచ్చు.

ఈ గ్లింప్స్ సినిమా షూర్ షాట్ హిట్ అనేలా వుంది. ఇందులో రామ్ చరణ్ లుక్ ,డైలాగ్స్, విజువల్స్ , బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అనిపించాయి.గ్లింప్స్ లో లాస్ట్ షాట్ లో ముందుకు వచ్చి బాల్ కొట్టే సీన్ వావ్ అనిపించింది. ఓవరాల్ గా పెద్ది గ్లింప్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ తోపాటు కామన్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంది. రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు.వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది థియేటర్లలోకి రానుంది. 

ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. కన్నడ మెగాస్టార్ శివ రాజ్ కుమార్ ఓ ముఖ్యమైన పాత్రలో, ఇంకా జగపతి బాబు, దివ్యేందు శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఆస్కార్ అవార్డు గ్రహీత ఎఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తుండగా.. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ ఆర్. రత్నవేలు ఐఎస్‌సి డీవోపిగా వర్క్ చేస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇక పెద్ది చిత్రాన్ని భారీ బడ్జెట్, అత్యాధునిక సాంకేతికత, అద్భుతమైన విజువల్స్, ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలతో ఎపిక్ స్కేల్‌లో నిర్మిస్తున్నారు. దీని మ్యాసీవ్ స్కేల్ ఇప్పటికే సంచలనం సృష్టిస్తోంది. కాగా ఈ చిత్రాన్ని విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో చెర్రీ మరోసారి బిగ్ స్క్రీన్ పై సంచలనం సృష్టించడానికి సిద్ధంగా వున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని చరణ్ కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయేలా తీస్తున్నాడు డైరెక్టర్ బుచ్చిబాబు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.