ప్రపంచవ్యాప్తంగా సినీరంగానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఆస్కార్’ అవార్డులలో కొత్త కేటగిరీ రాబోతుంది. ‘స్టంట్ డిజైన్’ అనే కేటగిరీలో కూడా అవార్డులు ఇవ్వనున్నారు. అయితే ఇది ఇప్పుడే అమలులోకి రావడం లేదు. 2028లో జరుగనున్న 100వ ఆస్కార్ అవార్డులలో ఈ కేటగిరీని ప్రవేశపెట్టనున్నారు. 2027లో విడుదల కానున్న సినిమాలను ఈ కేటగిరీ కింద నామినేషన్లలో చోటు కల్పించి స్క్రీనింగ్ అనంతరం ఎంపిక చేసి అవార్డులు ఇవ్వనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మేరకు విషయాన్ని తాజాగా అకాడమీ అధికారికంగా వెల్లడించింది. ఈ సందర్భంగా ఆస్కార్ కమిటీ మూడు చిత్రాల పోస్టర్లతో కూడిన ఒక ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అయితే ఇందులో మన తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పోస్టర్ కూడా ఉండటం విశేషం. మిగిలిన రెండూ హాలీవుడ్ మూవీస్ (ఎవిరీథింగ్ ఎవిరీవేర్ ఆల్ ఎట్ ఒన్స్ మరియు మిషన్ ఇంపాజిబుల్) కావడం గమనార్హం. ఈ మూడు సినిమాల్లోని కీలక స్టంట్స్ ఇమేజెస్‌ను ఉపయోగించింది.
ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డులలో కొత్త కేటగిరీ ప్రవేశపెట్టడంపై దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి స్పందించారు. స్టంట్ డిజైన్ కేటగిరీకి అవార్డులలో చోటు కల్పించడం పట్ల ఆయన ఆస్కార్ కమిటీకి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ మేరకు రాజమౌళి ఎక్స్ వేదికగా తన స్పందనను తెలియజేశారు. కమిటీ రిలీజ్ చేసిన పోస్టర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా విజువల్ చూసి తనకు ఎంతో ఆనందం కలిగిందని పేర్కొన్నారు.
“ఎట్టకేలకు..100 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. 2027 నుంచి విడుదలయ్యే సినిమాలకు ఇకపై స్టంట్ డిజైన్‌లో అవార్డులు రానున్నాయి. ఈ హిస్టారికల్ రికగ్నిషన్ సాధ్యం చేసినందుకు డేవిడ్ లీచ్, క్రిస్ ఓ’హారాలకు, ఇంకా స్టంట్ కమ్యూనిటీని, అలాగే స్టంట్ పని శక్తిని గౌరవించినందుకు గానూ ది అకాడమీ, CEO బిల్ క్రామెర్, ప్రెసిడెంట్ జానెట్ యాంగ్ తదితరులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు” అని చెప్పారు రాజమౌళి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: