తల అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ రేపు రిలీజ్ కానుంది.ఆఫ్ లైన్ ప్రమోషన్స్ ఏమి చేయకపోయినా కావల్సిన బజ్ వచ్చింది.తమిళం అయితే నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్ బుకింగ్ అవుతున్నాయి.మొదటి రోజు చెన్నై లో ఆల్మోస్ట్ అన్ని షోస్ ఫుల్ అయ్యాయి.హిట్ టాక్ వస్తే అజిత్ కెరీర్ లో నెవర్ బిఫోర్ ఓపెనింగ్స్ రానున్నాయి.చాలా రోజుల తరువాత అజిత్ నుండి వస్తున్న పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ఇదే.దాంతో అజిత్ ఫ్యాన్స్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అజిత్ వీరాభిమాని అధిక్ రవిచంద్రన్ ఈసినిమాను డైరెక్ట్ చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు ఈసినిమాతో టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది.ఇక ఈసినిమాకు రన్ టైం తక్కువగానే వుండనుంది.దాదాపు 2 గంటల 19 నిమిషాల రన్ టైంతో థియేటర్లలోకి రానుంది.ఇందులో అజిత్ సరసన త్రిష నటించగా సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.అజిత్ చివరి సినిమాలు అనుకున్నంత విజయం సాధించకపోవడంతో గుడ్ బ్యాడ్ అగ్లీ తో కం బ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.
అయితే గుడ్ బ్యాడ్ అగ్లీ తమిళంలో సోలోగా విడుదలవుతుండగా తెలుగులో మాత్రం పోటీ ఎదురుకానుంది.రేపు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ జాక్ కూడా విడుదలవుతుంది.దాంతో బాక్సాఫీస్ వద్ద ఇంట్రెస్టింగ్ క్లాష్ జరుగనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: