గుడ్ బ్యాడ్ అగ్లీ నుండి సెకండ్ సింగిల్ ‘గాడ్ బ్లెస్ యూ’ రిలీజ్

Good Bad Ugly Second Single God Bless U Out

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌తో పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. టి-సిరీస్‌ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పిస్తున్నారు. ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి ఆదిక్ రవిచంద్రన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. అర్జున్ దాస్, ప్రసన్న, సునీల్, ప్రభు తదితరులు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఏప్రిల్ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ ను ముమ్మురం చేశారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌, టీజర్‌, ట్రైలర్ సహా ఇతర ప్రచార చిత్రాలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు రీసెంట్‌గా సెన్సార్ పూర్తిచేసుకున్న గుడ్ బ్యాడ్ అగ్లీ దాదాపు 2 గంటల 19నిమిషాల నిడివితో థియేటర్లలోకి రానుంది.

ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ‘గాడ్ బ్లెస్ యూ’ అంటూ సాగే ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించగా.. గాయకుడు: నకాష్ అజీజ్ అద్భుతంగా ఆలపించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం, అజిత్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేస్తోంది. మొత్తానికి గుడ్ బ్యాడ్ అగ్లీ ఆడియన్స్‌కి గ్రేట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వబోతుందని అర్ధమవుతోంది.

కాగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ భారీ బడ్జెట్‌తో గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ హైలీ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్‌లో టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తుండగా.. అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్‌, జి ఎం శేఖర్ ప్రొడక్షన్ డిజైన్‌ను పర్యవేక్షిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.