విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ భక్తిరస ఇతివృత్తంతో రూపొందుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడి పాత్రలో కనిపిస్తుండగా.. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ రుద్ర అనే ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే కన్నప్ప నుండి టీజర్ మరియు మూడు పాటలను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఏప్రిల్ 25న ఈ సినిమా విడుదల కావాల్సివుండగా వీఎఫ్ఎక్స్ వర్క్స్ డిలే కారణంగా రిలీజ్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. జూన్ 27న కన్నప్ప రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. తాజాగా ఇందుకు సంబంధించి కొత్త రిలీజ్ డేట్ పోస్టర్‌ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతులమీదుగా లాంచ్ చేసింది చిత్ర యూనిట్.
ఈ మేరకు విష్ణు మంచు ఎక్స్ వేదికగా.. “నాకు ఇష్టమైన హీరోలలో ఒకరైన శ్రీ యోగి ఆదిత్యనాథ్ జీని కలిశాను. కన్నప్ప తేదీ ప్రకటన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. రమేష్ గోరిజాల పెయింటింగ్‌ను బహుమతిగా ఇచ్చారు. ఆయనలో ఎంత వినయపూర్వకమైన మరియు శక్తివంతమైన ప్రకాశం ఉందో నాకు తెలుసు. జూన్ 27న కన్నప్ప రిలీజ్ అవుతోంది. హర్ హర్ మహాదేవ్” అని పేర్కొన్నారు. అలాగే నటుడు మోహన్ బాబు కూడా సీఎం యోగికి కృతజ్ఞతలు తెలియజేశారు.
కాగా కన్నప్ప చిత్రంలో దేశవ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు నటిస్తున్న విషయం తెలిసిందే. మోహన్ బాబు, మోహన్ లాల్, మధుబాల, శరత్ కుమార్, దేవరాజ్, హీరోయిన్ ప్రీతి ముఖుంధన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే బ్రహ్మానందం, సప్తగిరి తదితరులు నటిస్తున్నారు. ఇక వీరితోపాటుగా విష్ణు మంచు కుమార్తెలు, కుమారుడు మరో ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి స్టీఫెన్ దేవస్సీ సంగీతం సమకూరుస్తున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: