పుష్ప 2 తరువాత టాప్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది.అందులో కుబేర ఒకటి. ధనుష్ హీరోగా నటిస్తుండగా కింగ్ నాగార్జున కీలక పాత్ర చేస్తున్నాడు. ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.ఇక ఈరోజు రష్మిక బర్త్ డే సందర్భంగా కుబేర నుండి స్పెషల్ వీడియో తో రష్మిక కు విషెస్ చెప్పింది కుబేర టీం.రష్మిక పాత్ర తాలూకు మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈసినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ , పుష్కర్ రామ్ మోహన్ నిర్మిస్తున్నారు.జూన్ 20న కుబేర పాన్ ఇండియా రిలీజ్ కానుంది. ఈసినిమా శేకర్ కమ్ముల రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా తెరకెక్కుతుంది. త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు.
ఇక రష్మిక ఈసినిమాతో పాటు ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా కూడా చేస్తుంది.రాహుల్ రవీంద్రన్ డైరక్ట్ చేస్తుండగా గీతా ఆర్ట్స్ నిర్మిస్తుంది. మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు. ఈఏడాది ద్వితీయార్థం లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























