అక్కినేని అఖిల్ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చి రెండేళ్లవుతోంది. చివరిగా ఆయన నటించిన చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఇటీవలే ఇది సోనీలివ్ ఓటీటీలోకి వచ్చింది. దీనితర్వాత ఇప్పటివరకూ అఖిల్ నుంచి మరే సినిమా రాలేదు. అసలు దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా లేదు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ అఖిల్ తదుపరి చిత్రంకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో అఖిల్ కొత్త సినిమాకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. రెండేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఆయన మళ్ళీ కెమెరా ముందుకు వస్తున్నాడు. కెరీర్ ఆరంభం నుంచీ హిట్ కోసం అఖిల్ తీవ్ర ప్రయత్నాలు చేస్తూనేఉన్నాడు, కానీ సరైన హిట్ బొమ్మ మాత్రం పడలేదు. ఈ క్రమంలో పలు హిట్ చిత్రాలకు కేరాఫ్ గా నిలుస్తున్న టాప్ ప్రొడక్షన్ హౌజ్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలో ఆయన ఓ కొత్త సినిమా చేస్తున్నారు. ఏప్రిల్ 8న అఖిల్ జన్మదినం సందర్భంగా ఈ మూవీ అనౌన్స్‌మెంట్ రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























