మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల 2’లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్‌లో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ ఇది. సంపత్ నంది సూపర్ విజన్‌లో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమన్నా నాగ సాధువుగా, మిస్టరీ ఎనర్జీతో కూడిన పాత్రలో కనిపించనున్నారు. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్ అంచనాలని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళింది. ఈ వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్‌లలో ఒకటిగా ఏప్రిల్ 17న ఓదెల 2 థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ హెబ్బా పటేల్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
ఓదెల రైల్వే స్టేషన్ సినిమా చేసినప్పుడు దీనికి సీక్వెల్ ఉంటుందని అనుకున్నారా?
- ఓదెల రైల్వే స్టేషన్ లాక్ డౌన్ టైంలో చేసిన సినిమా.
- కరోనా కారణంగా షూటింగులన్నీ ఆగిపోయాయి.
- మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో కూడా తెలియని సమయం అది.
- అప్పుడు సంపత్ నంది గారు అండ్ టీం ధైర్యంగా ముందుకు వచ్చి ఓదెల చేయడం జరిగింది.
- నిజానికి ఆ సమయంలో దీనికి సీక్వెల్ అవుతుందని నేను అనుకోలేదు.
- సినిమా చాలా మంచి విజయాన్ని అందుకుంది.
- మేము ఊహించిన దాని కంటే గొప్ప విజయం దక్కింది.
- సినిమా చూసిన ప్రేక్షకులంతా చాలా బావుందని మెచ్చుకున్నారు.
- అయితే అప్పుడు కూడా ఈ సినిమాకి సీక్వెల్ ఈ స్థాయిలో ఉంటుందని, ఇంత గ్రాండ్ స్కేల్లో సీక్వెల్ వస్తుందని నేను ఊహించలేదు.
- కరోనా సమయంలో ఒక చిన్న ప్రయత్నంగా మొదలుపెట్టిన ఓదెల ఘనవిజయాన్ని అందుకొని, ఇప్పుడు ఇంత గ్రాండ్ స్కేల్లో సీక్వెల్ ఓదెల 2ని ప్రేక్షకులకు ముందు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది.
ఓదెల 1కి ఓదెల 2కి డిఫరెన్స్ ఏంటి?
- ఓదెల 1 అవుట్ అండ్ అవుట్ మర్డర్ మిస్టరీ.
- ఓదెల 2 సూపర్ నేచురల్ థ్రిల్లర్.
- ఓదెల కంటే ఓదెల 2 మచ్ బిగ్గర్.
- చాలా అద్భుతమైనటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి.
- ఆడియన్స్‌కి గ్రేట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది.
తమన్నా గారితో మీ కాంబినేషన్ సీన్స్ ఎలా ఉంటాయి?
- ఇందులో తమన్నా గారితో నాకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి.
- తను నా సిస్టర్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు.
- అయితే సినిమాలో ఎక్కువ శాతం నేను జైల్ ఎపిసోడ్స్‌లో కనిపిస్తాను.
- ఫస్ట్ పార్ట్‌లో నా క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ చూపించిందో ఈ సెకండ్ పార్ట్‌లో కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది.
- కుమారి 21ఎఫ్ సినిమా నాకు ఒక ఫేమ్ తీసుకొచ్చింది.
- ఓదెల సినిమా యాక్టర్‌గా నాకు ఒక క్రెడిబిలిటీ ఇచ్చింది.
- నేను అన్ని రకాల పాత్రలు చేయగలనని నమ్మకాన్ని కల్పించింది.
- ఒక నటిగా ఓదెల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.
సంపత్ నంది గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
- సంపత్ గారు విజనరీ ఫిలిం మేకర్.
- ఆయన ఫస్ట్ ఓదెల కథలో నా క్యారెక్టర్ చెప్పినప్పుడు నాకే షాకింగ్ అనిపించింది.
- అంత పర్ఫార్మెన్స్ బేస్డ్ క్యారెక్టర్ నేను చేయగలనా? అనిపించింది.
- అయితే సంపత్ గారు ప్రయత్నించమని చెప్పారు.
- ఆయన నాపై అలాంటి నమ్మకాన్ని ఉంచడం చాలా ఆనందంగా అనిపించింది.
- ఆయన నమ్మకం నాకు మరింత కాన్ఫిడెన్స్ ఇచ్చింది.
- సంపత్ గారు చాలా నైస్, కైండ్ పర్సన్.
- ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
తమన్నా నుంచి ఎలాంటి విషయాలు నేర్చుకున్నారు?
- తమన్నా గారు ప్రతి క్యారెక్టర్‌ని చాలా సీరియస్‌గా తీసుకుంటారు.
- ఒక క్యారెక్టర్ కోసం ఆమె ప్రిపేర్ అయ్యే విధానం నాకు చాలా నచ్చింది.
- ఓదెల 2 కోసం చాలా అద్భుతంగా ప్రిపేర్ అయ్యారు.
- నిజానికి ఓదెల సినిమా చేస్తున్నప్పుడు నా క్యారెక్టర్ గురించి నేను ముందుగా ఏం ప్రిపేర్ కాలేదు.
- తమన్నా గారిలా హోంవర్క్ నేనెప్పుడూ చేయలేదు.
- ఫ్యూచర్‌లో అలాంటి హోంవర్క్ చేయాలని నేర్చుకున్నాను.
అశోక్ తేజ గారి డైరెక్షన్ గురించి?
- ఓదెల సినిమా నుంచి ఆయనతో కలిసి పని చేశాను. ఆయన చాలా క్లారిటీతో ఉంటారు.
- సంపత్ నంది గారు, అశోక్ తేజ గారు మంచి టీం వర్క్‌తో పని చేస్తారు.
- అశోక్ తేజ గారితో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్.
నిర్మాత మధు గారి గురించి?
- మధు గారు ప్రాజెక్ట్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు.
- ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని చాలా గ్రాండ్ స్కేల్‌లో నిర్మించారు.
- ఈ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించి ఆయనకి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరుకుంటున్నాను.
- ఈ సినిమా ముహూర్తాన్ని కాశీలో చేయడం జరిగింది.
- అలాగే టీజర్‌ని కుంభమేళాలో లాంచ్ చేసాం.
- ఈ కథ స్పిరిచ్యువాలిటీ, డివోషనల్‌తో ముడిపడి ఉంటుంది.
- మాకు ఆ డివైన్ పవర్ కూడా సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నాం.
అజినీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ గురించి?
- అజినీష్ మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్ ఎసెట్.
- ఆయన మ్యూజిక్‌తో సినిమాని మరో లెవెల్‌కి తీసుకెళ్లారు.
- బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది.
- ఒక సూపర్ నేచురల్ థ్రిల్లర్‌కి కావాల్సిన పర్ఫెక్ట్ మ్యూజిక్ ఇచ్చారు.
వశిష్ట గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
- ఓదెల1 లో ఫస్ట్ టైం ఆయనతో కలిసి నటించాను. తను అద్భుతమైన నటుడు.
- తనతో కలసి యాక్ట్ చేస్తున్నప్పుడు మనం కూడా అద్భుతంగా నటించాలనే ఇన్‌స్పిరేషన్ వస్తుంది.
ఇండస్ట్రీలో పదేళ్లు పూర్తి చేసుకున్నారు కదా.. ఈ జర్నీ ఎలా ఉంది?
- ఈ ప్రయాణం ఆనందంగానే ఉంది. అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి.
- అయితే ఒక నటిగా నేను ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాను.
- సక్సెస్ ఫెయిల్యూర్ ఏది ఫైనల్ కాదు.
- పనిచేసుకుంటూ వెళ్లడమే మన చేతిలో ఉంది.
- ఈ జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నాను.
- మరో 10 ఏళ్లు నటిగా ప్రయాణిస్తానని నమ్మకం ఉంది.
మీకు ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది?
- ఇప్పటివరకు చాలా జోనర్స్ సినిమాలు ట్రై చేశాను.
- ఒక ఫుల్ ఫ్లెడ్జ్ కామెడీ ఎంటర్‌టైనర్ చేయాలనుంది.
కొత్త ప్రాజెక్ట్స్ గురించి?
- తెలుగులో ఓ రెండు సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి.
- ఒక కన్నడ సినిమా చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ స్టార్ట్ కాబోతుంది.
ఆల్ ది బెస్ట్..
థాంక్ యూ.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























