బుచ్చిబాబుకి అపురూప కానుక అందించిన రామ్ చరణ్, ఉపాసన

Peddi Director Buchi Babu Sana Receives Divine Gift From Ram Charan and Upasana

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానాకి అపురూప కానుక అందింది. ఈ మేరకు ఆయనకు గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, ఉపాసన దంప‌తులు ఈ అరుదైన బ‌హుమతిని అందజేశారు. కాగా, ఇటీవల రామ్ చ‌ర‌ణ్ 40వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్‌ దంపతులు బుచ్చిబాబుకు హనుమాన్‌ చాలీసా మరియు హనుమంతుడి ప్రతిమను.. ఇంకా శ్రీరాముని పాదుకలను కూడా గిఫ్ట్‌గా పంపించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా “బుచ్చి.. నీవు నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతావు. నీపై ఆ హనుమాన్ ఆశీర్వాదం సదా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను” అని రాసిన ఒక నోట్‌ అందజేశారు. ఇక తనకు బహుమతిగా వచ్చిన అరుదైన అపురూప కానుకలకు బుచ్చిబాబు చెర్రీ దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ మేరకు ఆయన తాజాగా ఎక్స్ వేదిక‌గా విషయాన్ని పంచుకున్నారు. ఈ బహుమతి తనకెంతో ప్రత్యేకమని చెప్పారు.

“రామ్ చరణ్ సర్ మరియు ఉపాసన కొణిదెల గారు అద్భుతమైన బహుమతికి ధన్యవాదాలు. మీ ప్రేమ మరియు మద్దతుకు రుణపడి ఉన్నాను. హనుమంతుని ఆశీస్సులు మీకు తోడుగా ఉండాలని మరియు మీకు మరింత బలాన్ని మరియు శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్.. మీ విలువలు నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి మరియు ఎల్లప్పుడూ స్థిరంగా మరియు వినయంగా ఉండాలని మాకు గుర్తు చేస్తాయి.” అని అందులో పేర్కొన్నారు.

కాగా రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఏ మూవీ పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతోంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే బాలీవుడ్ న‌టుడు ‘మీర్జాపూర్‌’ వెబ్ సిరీస్‌ ‘మున్నాభయ్యా’ ఫేం దివ్యేందు శర్మ విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

ఇటీవలే ఈ మూవీ టైటిల్ మరియు ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేయ‌గా నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్ అయింది. ఈ ఆదివారం శ్రీరామ న‌వ‌మి కానుక‌గా ఈ మూవీ నుంచి గ్లింప్స్ విడుద‌ల కానుంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ మరియు వృద్ధి సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. బుచ్చిబాబు తొలి చిత్రం ‘ఉప్పెన’ నేషనల్ అవార్డ్ గెలుచుకున్న నేపథ్యంలో ఇప్పుడు రెండో సినిమాగా పెద్దిని తెరకెక్కిస్తుండటంతో దీనిపై భారీ అంచనాలే వున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.