కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గతచిత్రం ‘రాయన్’తో సూపర్ హిట్ అందుకున్నాడు. దీని తరువాత ఇటీవలే ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో ఆయన నటించడమే కాకుండా దర్శకత్వం వహించడం విశేషం. ఇక ప్రస్తుతం ధనుష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా వున్నాడు. దీనిలో భాగంగా ‘ఇడ్లీ కడై’ అనే సినిమా చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ధనుష్ సరసన నిత్య మీనన్ కథానాయికగా నటిస్తోంది. అయితే ఈ సినిమాకు కూడా ధనుష్ దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం. తాజాగా ఈ మూవీ రిలీజ్‌కి సంబంధించి కీలక అప్డేట్ అందించాడు హీరో ధనుష్. ఈ ఏడాది అక్టోబర్ 1న ఇడ్లీ కడై ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్టు తెలిపాడు.
ఇక ఇదిలావుంటే మరోవైపు ధనుష్ ఈ సినిమాతో పాటుగా ప్రస్తుతం ‘కుబేర’ కూడా చేస్తున్నాడు. తెలుగు, తమిళం భాషల్లో బై లింగువల్ గా తెరక్కుతున్న ఈ సినిమాలో కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జూన్ 20న రిలీజ్ కానుంది.
అలాగే ధనుష్ మరో మూడు సినిమాలకు కమిట్ అయ్యాడు. అందులో ఇళయరాజా బయోపిక్ ఒకటి కాగా, ఇంకొకటి ‘అమరన్’ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి డైరెక్షన్‌లో తన 55వ సినిమా చేయనున్నాడు. వీటితోపాటు హిందీలో ‘తేరే ఇష్క్ మే’ అనే ఓ సినిమా చేస్తున్నాడు. మొత్తానికి ఈ ఏడాది ధనుష్ నుంచి మూడు సినిమాలు అయితే పక్కాగా రిలీజ్ కానున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























