నందమూరి కళ్యాణ్ రామ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రమోషన్స్ తో మంచి బజ్ తెచ్చుకుంటుంది.రీసెంట్ గా ఈసినిమా నుండి టీజర్ , సాంగ్ రిలీజ్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు.ఏప్రిల్ 18న థియేటర్లలోకి రానుంది.ఈసినిమాకు ఒక్క రోజు ముందు తమన్నా ఓదెల 2 వస్తుంది.దాంతో ఈరెండు సినిమాల మధ్య పోటీ ఎదురుకానుంది.ఇక అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ డేట్ ని లాక్ చేయడంతో మేకర్స్ ప్రమోషనల్ యాక్టివిటీస్ లో జోరు పెంచనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాని ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేయగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ ఫుల్ రోల్ లో కనిపించనుంది.సరిలేరు నీకెవ్వరుతో రీ ఎంట్రీ తరువాత తనకు ఇది రెండో సినిమా.ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తయింది.కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రికార్డు సృష్టించింది.
ఇందులో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా శ్రీకాంత్,యానిమల్ పృథ్వీ రాజ్, సోహైల్ ఖాన్ ముఖ్య పాత్రలు పోషించారు.అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో అశోక్ వర్ధన్ ముప్పా,సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.
ఇక ఈసినిమా విజయం పై కళ్యాణ్ రామ్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.బింబిసారతో సూపర్ హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చిన కళ్యాణ్ రామ్ ఆ తరువాత డెవిల్ తో పరాజయాన్ని చవిచూశాడు.ఇక ఇప్పుడు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతితో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























