పవన్ కళ్యాణ్ గారి టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే..?

Akkada Ammayi Ikkada Abbayi Title is Perfect Apt For This Film, Directors Nitin-Bharath

టీవీ యాంకర్ టర్న్డ్ హీరో ప్రదీప్ మాచిరాజు నటించిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను యంగ్ ట్యాలెంటెండ్ డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ ఎగ్జైటింగ్ ఎంటర్‌టైనర్‌లో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టీజర్, ట్రైలర్, పాటలు ఇప్పటికే అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ సినిమా వేసవిలో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ ఎట్రాక్షన్‌గా ఏప్రిల్ 11న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా చిత్ర దర్శకులు నితిన్, భరత్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

ఈ మూవీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది?

  • మేము టెలివిజన్‌లో డిఫరెంట్ షోస్ చేశాం. అప్పటినుంచి ప్రదీప్ గారు పరిచయం.
  • ఆయన ఫస్ట్ సినిమాకి చివర్లో ఒక ప్రమోషన్ సాంగ్ షూట్ చేయాల్సి వచ్చింది.
  • అది మాకు ఎక్సైటింగ్‌గా అనిపించింది.
  • ప్రదీప్ గారితో చాలా క్రియేటివ్ థాట్స్ షేర్ చేసుకుంటాం.
  • ఒకసారి ఈ ఐడియా చెప్పాము, బావుందన్నారు.
  • తర్వాత బౌండ్ స్క్రిప్ట్ చేసి మొత్తం నేరేషన్ ఇచ్చాం.
  • ఆయనకు నచ్చింది. అలా ఈ మూవీ స్టార్ట్ అయింది.

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారి టైటిల్ కదా.. ఈ సినిమాకి ఎంత జస్టిఫికేషన్ గా ఉంటుంది?

  • ఈ సినిమాకి ఈ టైటిల్ యాప్ట్ అవుతుంది కాబట్టే తీసుకున్నాను.
  • ఇది పవన్ కళ్యాణ్ గారి టైటిల్. కచ్చితంగా పబ్లిసిటీ పరంగా ప్లస్ అవుతుంది.
  • అయితే ఈ యాప్ట్‌గా ఉండడం వల్లనే ఈ టైటిల్‌ని తీసుకోవడం జరిగింది.

టీవీ నుంచి సినిమాలకి రావడం ఈ జర్నీ ఎలా ఉంది?

  • ఇది బ్యూటిఫుల్ జర్నీ. టెలివిజన్ డిఫరెంట్, మూవీ డిఫరెంట్.
  • ఫిక్షన్‌కి నాన్‌ ఫిక్షన్‌కి చాలా తేడా ఉంటుంది.
  • మేము ఫిక్షన్‌కి అసిస్టెంట్ డైరెక్టర్స్ గా కూడా పనిచేయలేదు.
  • నాన్‌ ఫిక్షన్‌లో జడ్జిమెంట్ ఈజీగా తెలుస్తుంది.
  • కానీ సినిమా అలా కాదు.. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క పరిస్థితిలో షూట్ చేయాల్సి వస్తుంది.
  • దాన్ని రియాక్షన్ ఎలా ఉంటుందో సినిమా రిలీజ్ అయినంత వరకు అర్థం కాదు.
  • అయితే మాకు చాలా మంచి టీం ఉంది. మా డీఓపీ బాల్ రెడ్డి గారు, మ్యూజిక్ డైరెక్టర్ రధన్ చాలా అద్భుతమైన వర్క్ ఇచ్చారు.
  • చాలా బాగా సపోర్ట్ చేశారు. మంచి టీం వర్క్‌తో సినిమాని అద్భుతంగా చేసాం.

మీరు స్కిట్స్ ఎక్కువ చేసేవారు కదా.. దాని నుంచి ఏమైనా తీసుకున్నారా?

  • ప్రతి స్కిట్ ఒక కథ. అయితే సినిమా కొంచెం పెద్ద కథ.
  • ఇందులో కామెడీ అంతా కూడా చాలా సిచ్యువేషనల్‌గా ఉంటుంది. చాలా ఆర్గానిక్‌గా ఉంటుంది.
  • ఇందులో సిచ్యువేషన్ కామెడీ ఎక్కువగా ఉంటుంది, ఇది ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ లాగా ఉంటుంది.
  • బ్రహ్మానందం గారు, సత్య గారి పాత్రలన్నీ కథలో ఆర్గానిక్‌గా ఉంటాయి. ఆ పాత్రలని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు.

హీరోయిన్ దీపిక పిల్లి క్యారెక్టర్ గురించి?

  • ఒక తెలుగు అమ్మాయితో ఈ క్యారెక్టర్‌ని చేయించాలనుకున్నాం.
  • దానికి తగ్గట్టే ఆడిషన్ చేసాం. ఆ పాత్రకు తను పర్ఫెక్ట్‌గా ఫిట్ అయింది.
  • తన క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.

మైత్రి మూవీ మేకర్స్‌కి చూపించి రిలీజ్ చేస్తున్నారా?

  • మైత్రి మూవీ మేకర్స్ సినిమాని చూశారు. వారికి సినిమా చాలా నచ్చింది.
  • సినిమాలో చాలా పొటెన్షియల్ ఉందని చెప్పారు.
  • ఇది సమ్మర్‌కి రావాల్సిన సినిమా అని వారే రిలీజ్ డేట్ ఆలోచించి ఫిక్స్ చేశారు.
  • వారే మా ఫస్ట్ ఆడియన్స్. వారి రియాక్షన్ చూసిన తర్వాత మాకు చాలా ఆనందంగా అనిపించింది.
  • ఈ సమ్మర్‌లో ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే సినిమా ఇది.
  • ఖచ్చితంగా అందరిని ఎంటర్‌టైన్‌ చేస్తుంది.

నిర్మాతల సపోర్ట్ గురించి?

  • ప్రదీప్ గారి ఫ్రెండ్స్ అందరూ కలిసి చేశారు.
  • నిర్మాతల నుంచి చాలా సపోర్ట్ వుంది. మేము అడిగినదంతా ఇచ్చారు. రధన్ మ్యూజిక్ గురించి?
  • రధన్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో మంచి డాన్స్ నంబర్స్ ఉన్నాయి.
  • ప్రదీప్ గారు చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. తనని డిఫరెంట్‌గా ప్రొజెక్ట్ చేసాము.
  • రధన్ గారు సినిమా సోల్‌కి తగ్గ మ్యూజిక్ ఇచ్చారు.
  • కథకి చాలా పర్సనల్‌గా కనెక్ట్ అయి మ్యూజిక్ చేశారు.
  • అలాగే శేఖర్ మాస్టర్ గారి కొరియోగ్రఫీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

డైరెక్టర్స్ గా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారా?

  • కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి.
  • రిలీజ్ తర్వాత వాటి గురించి ఆలోచించాలి.

ఆల్ ది బెస్ట్..

థాంక్ యూ.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.