నందమూరి కళ్యాణ్ రామ్ అర్జున్ S/O వైజయంతి ఈ సమ్మర్ లో థియేటర్లలోకి రానుంది.దాంతో సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు.రీసెంట్ గా వచ్చిన టీజర్ భారీ అంచనాలను క్రియేట్ చేసింది. టీజర్ తోనే సినిమా థియేటర్,నాన్ థియేటర్ బిజినెస్ మొత్తం క్లోజ్ అయ్యింది.కళ్యాణ్ రామ్ కెరీర్లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమాగా అర్జున్ S/O వైజయంతి రికార్డు క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి నిన్న మొదటి పాట ను నాయాల్దిని రిలీజ్ చేశారు.ఈ సాంగ్ లాంచ్ నరసరావుపేటలోని రవి కళా మందిర్లో భారీగా తరలివచ్చి ఫ్యాన్స్ సమక్షంలో చాలా గ్రాండ్ గా జరిగింది.ఈ సందర్భంగా అభిమానులు భారీ ర్యాలీని నిర్వహించారు. సాంగ్స్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా సునీల్ బలుసు నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి అధికారిగా కీలక పాత్ర పోషించారు.
ఇక ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లాకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మొట్టమొదటి ఈవెంట్ చేయడం ఇంకా ఆనందంగా ఉంది.నేను పటాస్ తర్వాత ఎప్పుడు బయటికి రాలేదు. పటాస్ సక్సెస్ మీట్ కి వచ్చాను.ఈ వేడుక చూస్తుంటే సాంగ్ లాంచ్ ఈవెంట్ లా లేదు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సక్సెస్ మీట్ లా అనిపిస్తుంది. ప్రతిసారి మీ మన్ననలని పొందడానికి ప్రయత్నిస్తుంటాను.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చెప్పినట్లు అతనొక్కడే సినిమాల ఈ సినిమా కూడా మరో 20 లు గుర్తుండిపోయే సినిమా అవుతుంది.ఈ సినిమాలో మా అమ్మ పాత్ర చేసిన విజయశాంతి గారు ఆ క్యారెక్టర్ ని ఒప్పుకోవడం వల్లే ఈ సినిమా చేయడం జరిగింది. విజయశాంతి గారికి ధన్యవాదాలు.అమ్మలని గౌరవించడం మన బాధ్యత. వాళ్ళ కోసం ఎంత త్యాగం చేసినా తప్పులేదు.ఈ సినిమాని అమ్మలందరికీ అంకితం చేస్తున్నాం. అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళండి. జోహార్ ఎన్టీఆర్. జోహార్ హరికృష్ణ. జై హింద్ అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























