మ్యాడ్ స్క్వేర్ వర్కింగ్ డేస్ లో కూడా అదరగొడుతుంది.తొలి నాలుగు రోజులు డబుల్ డిజిట్ గ్రాస్ తో హవా కొనసాగించిన ఈ సినిమా నిన్న కూడా సాలిడ్ గా హోల్డ్ చేసింది.దాంతో ఈసినిమా కేవలం 5 రోజుల్లోనే 74 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఈవారంలో 100 కోట్ల క్లబ్ లో చేరనుంది.ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.ఫల్ రన్ లో ఊహించని లాభాలను తీసుకురానుంది. అటు ఓవర్సీస్ లోనూ ఈసినిమా బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసి లాభాల బాట పట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఓవరాల్ గా మ్యాడ్ సీక్వెల్ గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ మీడియం బడ్జెట్ సీక్వెల్స్ లో టిల్లు స్క్వేర్ తరువాత 100 కోట్ల క్లబ్ లో చేరనున్న రెండవ సినిమాగా రికార్డు సృష్టించనుంది.గత ఏడాది ఇదే టైం లో వచ్చిన టిల్లు స్క్వేర్ కూడా 100కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.మ్యాడ్ స్క్వేర్ నిర్మించిన బ్యానర్లే ఈసినిమాను నిర్మించాయి.
మ్యాడ్ స్క్వేర్ ను కళ్యాణ్ శంకర్ తెరకెక్కించగా నార్నె నితిన్,సంగీత్ శోభన్ ,రామ్ నితిన్ ,విష్ణు ఓయ్ లీడ్ రోల్స్ లో నటించారు.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు.ఇక సినిమా సెన్సేషనల్ హిట్ కావడంతో సక్సెస్ మీట్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.ఈ ఈవెంట్ కు ఓ స్టార్ హీరోని గెస్ట్ గా తీసుకురావాలనుకుంటున్నారని సమాచారం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























