సికందర్ 4 డేస్ కలెక్షన్స్

Sikandar Four Days Worldwide collections

సౌత్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్,బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా సికందర్.గత నెల 30న విడుదలైన ఈసినిమాకు రివ్యూస్ నెగిటివ్ గా వచ్చాయి.అయినా ఆ ప్రభావం కలెక్షన్స్ పై పెద్దగా పడలేదు. సల్మాన్ ఖాన్ క్రేజ్ తో ఈసినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లను రాబడుతుంది.4 రోజుల్లో సికందర్ ప్రపంచ వ్యాప్తంగా 158.5కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది. హిట్ టాక్ వచ్చివుంటే సికందర్ సల్మాన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచేది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా కాజల్ , సత్యరాజ్ ను కీలక పాత్రలు పోషించారు.సాజిద్ నడియాడ్‌వాలా ఈసినిమాను నిర్మించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.

ఇక ఈసినిమా తరువాత సల్మాన్ ఖాన్ తెలుగు డైరెక్టర్ హరీష్ శంకర్ తో సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మించనుందట. ఇంతకుముందే పలు సార్లు సల్మాన్ ను కలిసి కథ వినిపించాడట హరీష్ శంకర్.సల్మాన్ కూడా ఇంట్రెస్ట్ గానే వున్నాడట. త్వరలోనే ఈసినిమా విషయంలో క్లారిటీ రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.