టాలీవుడ్ హీరో నితిన్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ హై బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించగా.. నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా గతంలో నితిన్, వెంకీ కుడుముల కాంబోలో వచ్చిన ‘భీష్మ’ మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ నిన్న (మార్చి 28) ప్రేక్షకుల ముందుకు వచింది. మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుని ప్రపంచ వ్యాప్తంగా హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.
ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ పాత్ర గురించి మేకర్స్ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో ఎక్కువగా ప్రస్తావించారు. అలాగే వార్నర్ కూడా పలు ఈవెంట్స్‌లో కనిపించి రాబిన్‌హుడ్ సినిమాని బాగా ప్రమోట్ చేసాడు. అయితే వార్నర్ మూవీలో కనిపించింది క్లైమాక్స్ లోనే. అది కూడా నెగిటివ్ షేడ్స్ లో, ఓ రెండు నిముషాలపాటే. ఇది కేవలం ఇంట్రడక్షన్‌లా ఉంటుంది. దీంతో ఫ్యాన్స్ కొంచెం నిరుత్సాహపడ్డారు.
ఇకపోతే, ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని చివరలో ప్రకటించిం ఆడియెన్స్‌ని సర్‌ప్రైజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సీక్వెల్ పేరుని కూడా ప్రకటించింది. దీనికి ‘బ్రదర్ హుడ్ ఆఫ్ రాబిన్ హుడ్’ అనే టైటిల్ పెట్టనున్నట్టు తెలిపింది. అయితే ఈ సీక్వెల్‌లో డేవిడ్ వార్నర్ మెయిన్ విలన్ అని క్లైమాక్స్‌లో హింట్ ఇవ్వడం గమనార్హం. దీంతో సీక్వెల్‌లో నితిన్, వార్నర్ మధ్య ఫేస్ టూ ఫేస్ సీన్స్ ఉండే అవకాశం ఉండటంతో ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























