హీరో నితిన్ సమ్మర్ క్లీన్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మార్చి 28న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ.. “ఈరోజు రిలీజ్ అయిన మా రాబిన్ హుడ్ సినిమాకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. మేము సినిమాని థియేటర్స్ లో చూసి వచ్చాం.ఆడియన్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు.”
“ఇది ఆడిటోరియంలో సూపర్ హిట్ సినిమా. థియేటర్స్ లో అందరూ ఎంజాయ్ చేసే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ, యూత్ అందరూ వెళ్లి ఎంజాయ్ చేసే సినిమా. ఇందులో మంచి కథతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ ఎంటర్టైన్మెంట్ ఫైట్స్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ సినిమా సమ్మర్ కి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలుస్తుందని నమ్ముతున్నాం.”
“ప్రతి షో కి కలెక్షన్స్ పెరుగుతూ వెళ్తున్నాయి. గ్రాడ్యుల్ గా ఈ సినిమా పెరుగుతూ వెళ్తుందని గట్టిగా నమ్ముతున్నాం. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కాల్ చేసి చాలా బాగుందని చెప్పారు. ప్రతి షో కి కలెక్షన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. సినిమా ఖచ్చితంగా విన్నర్ అవుతుందని నమ్ముతున్నాం. అందరికీ థాంక్ యూ” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: