ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ సూపర్ హీరో క్యారక్టర్‌తో తెరకెక్కిన మూవీ ‘కోయీ మిల్ గయా` (క్రిష్). బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన ఈ మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీంతో ఈ సినిమాకి కొనసాగింపుగా క్రిష్ 2, క్రిష్ 3 చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇక ఈ సినిమాలన్నింటికీ హృతిక్ రోషన్ తండ్రి ప్రముఖ ఫిల్మ్ మేకర్ రాకేష్ రోషన్ దర్శకత్వం వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ఈ సిరీస్‌లో భాగంగా నాలుగో చిత్రం ‘క్రిష్ 4’ రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీప్రొడక్షన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే క్రిష్ 4కి హీరో హృతిక్ రోషన్ డైరెక్షన్ చేయనుండటం విశేషం. ఈ మేరకు విషయాన్ని రాకేష్ రోషన్ స్వయంగా తెలియజేశారు. ఫస్ట్ పార్ట్ లో సందడి చేసిన జాదూ కూడా ఇందులో కీలక పాత్ర పోషించనున్నట్టు వెల్లడించారు. కాగా క్రిష్ ఫ్రాంచైజీలో భాగంగా వస్తోన్న ఈ మూవీ పూర్తిగా అంతరిక్షంలో జరిగే కథగా రూపొందనుంది.
ఇక ఈ సందర్భంగా రాకేష్ రోషన్ సోషల్ మీడియాలో దీనిగురించి వివరిస్తూ.. “25 సంవత్సరాల క్రితం నేను మిమ్మల్ని నటుడిగా పరిచయం చేసాను, మరియు ఈరోజు మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత ఇద్దరు చిత్రనిర్మాతలు ఆది చోప్రా మరియు నేను మా అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం క్రిష్ 4 ను ముందుకు తీసుకెళ్లడానికి మిమ్మల్ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాము.” అని పేర్కొన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























