మిస్టర్ బచ్చన్ తరువాత మాస్ మహా రాజా రవితేజ నటిస్తున్న సినిమా మాస్ జాతర.మనదే ఇందంతా అనేది ట్యాగ్ లైన్. రవితేజకు ఇది 75వ సినిమా.ఈ ల్యాండ్ మార్క్ మూవీని సామజవరగమన రైటర్ భాను భోగవరపు తెరకెక్కిస్తున్నాడు.ఇక షూటింగ్ విషయానికి వస్తే రీసెంట్ గానే ఓ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.ఏప్రిల్ లో నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యి 22 వరకు హైదరాబాద్ లో జరుగనుంది.ఇందులో క్లైమాక్స్ ను చిత్రీకరించనున్నారు.దీని తరువాత చిన్న షెడ్యూల్ బ్యాలెన్స్ ఉండనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మే 9న ఈ సినిమా ను రిలీజ్ చేస్తామని ప్రకటించారు కానీ ఆ డేట్ కు రిలీజ్ చేయడం అనుమానమే.త్వరలోనే మరో రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.మాస్ జాతరలో రవితేజ రైల్వే పోలీస్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించనుండగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.ఈసినిమాపై రవితేజ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.
ఇక ఈసినిమా తరువాత రవితేజ ,కిషోర్ తిరుమలతో సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి.దసరా నిర్మాత చెరుకూరి సుధాకర్ నిర్మించనున్నారట. అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సివుంది.అలాగే మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తో రవితేజ సోషియో ఫాంటసీ మూవీ చేయనున్నాడు.సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























