దసరా కాంబో మరోసారి రిపీట్ కానుందని తెలిసిందే.ఈ కాంబినేషన్ లో ఈసారి ది ప్యారడైజ్ రానుంది.రీసెంట్ గా విడుదలచేసిన గ్లింప్స్ అయితే అందరికి షాక్ ఇచ్చింది. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ,నానిని ఈసారి రా & బోల్డ్ గా చూపించనున్నాడు.గ్లింప్స్ తో అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయాయి.ఇక ఈసినిమాను వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ చేయనున్నారు.ఇదే విషయాన్ని మేకర్స్ మరోసారి కంఫర్మ్ చేశారు.ది ప్యారడైజ్ రిలీజ్ కి సరిగ్గా ఏడాది వుందని ఈరోజు పోస్టర్ ద్వారా ప్రకటించారు.సో రిలీజ్ డేట్ లో ఛేంజ్ వుండకపోవచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.ఈసినిమా దక్షిణాది భాషలతో పాటు హిందీ , బెంగాలీ , ఇంగ్లీష్ , స్పానిష్ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.మే లో సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలనీ చూస్తున్నారు.డిసెంబర్ లోగా కంప్లీట్ చేసి అనుకున్న తేదికి సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నారు.
ఇక ప్రస్తుతం నాని, హిట్ 3 చేస్తున్నాడు.ఈసినిమాపై కూడా భారీ అంచనాలు వున్నాయి.శైలేష్ కొలను ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. మే 1న హిట్ 3ని థియేటర్లలోకి తీసుకురానున్నారు.వచ్చే నెల ఫస్ట్ వీక్ లో షూటింగ్ కంప్లీట్ కానుంది.ఈసినిమా కూడా విజయం సాధిస్తే నాని వరుసగా నాలుగో హిట్ ను ఖాతాలో వేసుకోనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: