నేచురల్ స్టార్ నాని నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా హిట్ 3.రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈసినిమా టీజర్ లో నాని ఫెరోషియస్ అవతార్ లో కనిపించి అదరగొట్టాడు.సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ కావొచ్చింది.ఇక ఈసినిమా నుండి ఈరోజు ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు.ప్రేమ వెల్లువ అంటూ వచ్చిన ఈ మెలోడీ సాంగ్ బాగుంది.ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ ,నూతన మోహన్ వోకల్స్ అందించగా కృష్ణకాంత్ రచించారు.మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హిట్ సిరీస్ లో థర్డ్ పార్ట్ గా వస్తున్న ఈసినిమాను శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తుండగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. నాని ,ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. మే 1న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.ఈసినిమా విజయం సాధిస్తే నాని వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకోనున్నాడు.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
ఇక నాని ప్రస్తుతం కోర్ట్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.తన బ్యానర్ లో వచ్చిన ఈసినిమా సాలిడ్ వసూళ్లను రాబడుతూ డబుల్ బ్లాక్ బస్టర్ దిశగా సాగుతుంది.10 రోజుల్లో ఈసినిమా 5 0కోట్ల వసూళ్లను రాబట్టింది.అంతేకాదు నాని ఇప్పటివరకు నిర్మించిన సినిమాల్లో అత్యధిక వసూళ్లతో పాటు హైయెస్ట్ ప్రాఫిట్స్ ను తీసుకొచ్చింది. మరి హిట్ 3,ఈ రికార్డుల ను బ్రేక్ చేస్తుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: