ఛలో ,భీష్మతో వరుస హిట్లు కొట్టిన డైరెక్టర్ వెంకీ కుడుముల రాబిన్ హుడ్ తో హ్యాట్రిక్ పై కన్నేశాడు.మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ఈసినిమా షూర్ షాట్ హిట్ అవ్వుద్ది అనే టాక్ ను తెచ్చుకుంది.ట్రైలర్ ,సాంగ్స్ మెప్పించాయి.ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు.అయితే భీష్మ తరువాత చాలా గ్యాప్ తీసుకున్నాడు వెంకీ.నిజానికి ఈ డైరెక్టర్ రాబిన్ హుడ్ కి ముందు మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేద్దాం అనుకున్నాడు. చిరు కి స్టోరీ లైన్ కూడా చెప్పాడు.చిరు కూడా ఓకే అన్నాడు.దానయ్య డివివి నిర్మించాలనుకున్నారు కానీ ఫుల్ స్క్రిప్ట్ చిరు ని ఇంప్రెస్ చేయలేకపోయింది దాంతో వెంకీ కుడుముల గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా గురించి వెంకీ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో స్పందించాడు. మంచి ఛాన్స్ మిస్ అయ్యింది.కథ అనుకున్న విధంగా షేప్ కాలేకపోయింది దాంతో క్యాన్సిల్ అయ్యిందని అయితే ఇప్పటికీ చిరంజీవి గారు ఫోన్ చేస్తుంటారని వెంకీ చెప్పుకొచ్చాడు.ఇక రాబిన్ హుడ్ విజయం పై వెంకీ ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.
ఇందులో నితిన్ హీరోగా నటించగా శ్రీ లీల హీరోయిన్ గా చేసింది. ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ క్యామియో రోల్ లో మెరవనున్నాడు.సెన్సార్ రిపోర్ట్ కూడా పాజిటివ్ గా వుంది.సినిమాలో కామెడీ , ఎమోషన్ బాగా వర్క్ అవుట్ అయ్యిందని టాక్. జివి ప్రకాష్ కుమార్ ఈసినిమాకు సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.నితిన్ కెరీర్ లో రాబిన్ హుడ్ భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: