టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటించింది. నట కిరీటి రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించగా.. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిధి పాత్రలో మెరిశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ రీసెంట్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించగా, స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ చీఫ్ గెస్ట్‌గా హాజరై సందడి చేశాడు.
ఈ సందర్భంగా రాబిన్‌హుడ్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో రాబిన్‌హుడ్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ అందించింది.
ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ బ్యుటీఫుల్ సినిమాటోగ్రఫీని అందించగా.. కోటి ఎడిటర్‌గా, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇక మరో మూడు రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో టికెట్ రేట్ల పెంపుకి అనుమతివ్వడం గమనార్హం. ఇది సినిమాకి కలిసొచ్చే అంశం. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ గ్రాండ్‌గా నిర్మించిన రాబిన్‌హుడ్ మార్చి 28న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: