సందీప్ కిషన్, రావు రమేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మజాకా’. ‘ధమాకా’ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ మూవీలో రీతూ వర్మ ఫిమేల్ లీడ్ రోల్ పోషించగా.. మురళి శర్మ, అన్షు కీలక పాత్రల్లో నటించారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మించగా.. లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విడుదలకు ముందే ప్రచార చిత్రాలతో భారీ అంచనాలు ఏర్పరుచుకున్న మజాకా మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న థియేటర్లలో విడుదలయింది. యూత్ అండ్ ఫామిలీ ఆడియెన్స్‌ని విశేషంగా అలరించి మంచి వసూళ్లనే రాబట్టుకుంది. దీంతో ఈ సినిమా ఓటీటీ అప్‌డేట్ కోసం మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీనికి సంబంధించి కీలక అప్‌డేట్ అందింది. మార్చి 25నుంచి ZEE5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

కథ:-
వెంకట రమణ (రావు రమేష్) కృష్ణ (సందీప్ కిషన్) తండ్రీ కొడుకులు. ప్రసవ సమయంలో కృష్ణ తల్లి చనిపోతుంది. దీంతో కొడుకును అల్లారుముద్దుగా పెంచుతాడు. పెద్దయ్యాక ఒక స్నేహితుడిలా మెలుగుతుంటాడు. కొడుకుపై అభిమానంతో వెంకట రమణ మరో పెళ్లి చేసుకోడు. సందీప్ ఒకరిని పెళ్లి చేసుకొని కుటుంబంతో హాయిగా జీవితం గడపాలని కోరుకుంటుంటాడు.
అయితే ఆడదిక్కు లేని ఇంటికి తమ కూతురిని పంపించడానికి కొందరు తిరస్కరింస్తారు. దీంతో కొడుకుకి పెళ్లి సంబంధాలు బాచినట్టే వచ్చి వెనక్కి వెళ్లిపోతుంటాయి. దీనికి పరిష్కారంగా రావు రమేష్, కొడుకు పెళ్లి కంటే ముందు తను పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు. ఈ నేపథ్యంలో రావు రమేష్ యశోద (అన్షు)తో ప్రేమలో పడతాడు. మరోవైపుసందీప్ కిషన్ మీరా (రీతు వర్మ)తో ప్రేమలో పడతాడు.
ఇదిలావుండగానే అనుకోని కారణాల రీత్యా సందీప్, రావు రమేష్ వ్యాపారవేత్త అయిన భార్గవ వర్మ (మురళీ శర్మ)కు శత్రువులుగా మారతారు. ఇంకోవైపు సందీప్, రావు రమేష్ ఇద్దరూ తమ పెళ్లిళ్ల గురించి ఫైనల్ డెసిషన్ తీసుకోవాలని భావిస్తారు. అదేసమయంలో వారికి ఒక నిజం తెలుస్తుంది. అదేంటి?
వారిద్దరూ పెళ్లి చేసుకున్నారా? అసలు తండ్రి ప్రేమ విషయం కొడుక్కి, కొడుకు ప్రేమ విషయం తండ్రికి ఎప్పుడు తెలిసింది? యశోద, మీరా మధ్య శత్రుత్వం ఏమిటి? వాళ్లిద్దరి మధ్య ఏం జరిగింది? భార్గవ వర్మతో వైరం ఏమైంది? అతను ఎందుకు వీరి పెళ్లిళ్లకు అడ్డుపడుతున్నాడు? తమకు ఎదురైన అడ్డంకులను తొలగించి రమణ, కృష్ణ పెళ్లిళ్లు చేసుకున్నారా? లేదా? మిగిలిన అనేది మిగతా కథ.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: