మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గత కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవలికాలంలో ఆయన నటించిన చిత్రాలేవీ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేదు. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఈసారి గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయిన వరుణ్ తన తదుపరి సినిమాను డిఫరెంట్ జానర్‌లో ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో ఆయన కొత్త మూవీ #VT15 (వర్కింగ్ టైటిల్) చిత్రంతో రాబోతున్నాడు. “When haunting turns hilarious!! అనే ట్యాగ్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమంలో ప్రాజెక్ట్ లోని టీం సభ్యులు పాల్గొన్నారు.
ఈ వేడుక అఫీషియల్ గా ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌కు నాంది పలికింది. ఈ యూనిక్ సినిమాటిక్ అడ్వంచర్ ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. రెగ్యులర్ షూటింగ్ కూడా ఈరోజే హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇండో-కొరియన్ హారర్ కామెడీ జానర్‌లో ఎమోషన్స్, థ్రిల్స్ రోలర్-కోస్టర్ రైడ్‌గా ఉండబోతోంది.
హ్యూమరస్ అండ్ అడ్వంచరస్ చిత్రాలను రూపొందించడంలో పేరుపొందిన మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. వరుణ్ తేజ్‌తో చేయబోతున్న ఈ సినిమా కోసం డైరెక్టర్ మేర్లపాక గాంధీ యూనిక్ స్టోరీలైన్‌ను డిజైన్ చేశారు. సరికొత్త జానర్‌తో ప్రేక్షకులకు వింత అనుభూతిని పంచేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే పూర్తవగా.. వియత్నాంలో అద్భుతమైన లొకేషన్స్ సెలెక్ట్ చేశారు.
ఈ చిత్రం కోసం గాంధీ థ్రిల్స్, హ్యుమర్ బ్లెండ్ చేస్తూ అద్భుతమైన స్క్రిప్ట్‌ను రాసినట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ను యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. ఇక దర్శకుడు మేర్లపాక గాంధీ, యూవీ క్రియేషన్స్‌తో ఇది వరుణ్ తేజ్ ఫస్ట్ కొలాబరేషన్. అలాగే తొలి ప్రేమ భారీ విజయం తర్వాత, వరుణ్ తేజ్ మరోసారి సెన్సేషనల్, బ్లాక్‌బస్టర్ సంగీత దర్శకుడు ఎస్. థమన్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు.
ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ఇప్పటి వరకు కనిపించని సరికొత్త మేకోవర్‌తో స్క్రీన్‌పై మెస్మరైజ్ చేయనున్నారు. గతంలో ఆయన ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో విమర్శకుల ప్రశంసలు పొందిన ‘కంచె’ సినిమా చేశారు. మేర్లపాక గాంధీ గతంలో UV క్రియేషన్స్ బ్యానర్‌పై సెన్సేషనల్ హిట్ ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాన్ని తీశారు. ఈ హిలేరియస్ అడ్వంచరస్ మూవీకి సంబధించిన మరిన్ని అప్‌డేట్స్ మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: